కట్ చేస్తే కడుపులోంచి 18టూత్ బ్రష్ లు బయటికొచ్చాయ్.!

ఓ వ్యక్తి కడుపు నుంచి 18 టూత్‌బ్రష్‌లను బయటికి తీసిన వైద్యులు… షాకింగ్ సంఘటనతో డాక్టర్ల విస్మయం…
మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. అయితే వీరిలో ఎవరికైనా జీవితంలో కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సుఖాలు, సంతోషాలు కూడా కలుగుతుంటాయి. జీవితంలో అనుభవించే ఆనందాల సంగతి పక్కన పెడితే కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం మనలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. కొందరు మద్యం సేవించి బాధలను మరిచిపోదామని భావిస్తే మరికొందరు జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటారు. ఇంకా కొంత మంది ఎల్లప్పుడూ డిప్రెషన్‌తో ఉంటారు. అయితే వీరే కాదు, సమస్యలు ఎదురైనప్పుడు వింత చేష్టలు చేసే వారు కూడా మన సమాజంలో అధిక భాగమే ఉన్నారు. అలాంటి వారిలో ఓ వ్యక్తి చేసిన సంఘటనే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
ఏం ఇబ్బందులు కలిగాయో ఏమో గానీ ఓ వ్యక్తి ఒకేసారి 18 టూత్‌బ్రష్‌లను అమాంతం మింగేశాడు. అయితే ఇది గమనించిన ఇరుగు పొరుగు వారు అతన్ని హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా హాస్పిటల్‌లో అతనికి చికిత్సనందించిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
వైద్యులు అలా షాక్‌కు గురవడానికి కారణమేమిటంటే అతని పొట్ట నుంచి 18 టూత్‌బ్రష్‌లు బయటకు రావడం. కేవలం అవే కాదు కొన్ని లోహపు వస్తువులను కూడా వైద్యులు పలు విధాలుగా బయటికి తీశారు. అలా ఒక్కో వస్తువును బయటికి తీసీ తీసీ వారు అలసిపోవడమే కాదు, ఆ వ్యక్తి చేసిన పనికి విస్మయానికి లోనయ్యారు కూడా. అయినా ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతం చేసి ఆ వ్యక్తిని బతికించారు. పైన చెప్పిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దాన్ని చూడాలనుకుంటే మీరూ చూడవచ్చు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top