ఆ జంట వివాహం కోసం అయిన ఖ‌ర్చు రూ.500 మాత్ర‌మే..!

ఓ జంట పెళ్లి చేసుకుంటే ఎంత ఖ‌ర్చు అవుతుందో మీకు తెలుసు క‌దా..! ఎంత లేద‌న్నా మినిమం ఖ‌ర్చులు అయినా ఉంటాయి క‌దా. క‌నీసం రూ.1 ల‌క్ష లేదా రూ.2 ల‌క్ష‌లు అయితే త‌ప్ప చిన్న‌పాటి పెళ్లి జ‌ర‌గ‌దు. అదీ ఖర్చులన్నీ బాగా త‌గ్గించుకుంటే త‌ప్ప పెళ్లికి అంత త‌క్కువ ఖ‌ర్చు చేయ‌డం అసాధ్యం. కానీ ఆ జంట మాత్రం కేవ‌లం రూ.500 తోనే పెళ్లి చేసుకున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. షాకింగ్‌గా ఉన్నా మీరు ఇది న‌మ్మాల్సిందే..!

surat-couple
అది గుజ‌రాత్‌లోని సూర‌త్ ప్రాంతం. ఆ జంట పేర్లు ద‌క్ష‌, భ‌ర‌త్ ప‌ర్మార్‌. వీరిద్ద‌రి వివాహం ఈ నెల‌లో మొన్నా మ‌ధ్యే జ‌రిగేట్టు ప్లాన్ చేసుకున్నారు. కానీ నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ వ‌ల్ల ఎక్కువ న‌గ‌దు ల‌భ్యం కాక‌పోతుండ‌డంతో పెళ్లి గురించి పున‌రాలోచించుకోవాల‌ని అనుకున్నారు. అయితే డ‌బ్బులు లేని కార‌ణంగా పెళ్లిని ఆప‌డం ఎందుక‌ని భావించి, వారు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అదేమిటంటే…

త‌మ వ‌ద్ద ఉన్న రూ.500 తోనే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికే కొనుగోలు చేసిన పెళ్లి బ‌ట్ట‌లు, ఇత‌ర సామగ్రి అన్నీ ఉన్నాయి కానీ, పెళ్లికి మండ‌పం, భోజ‌నాలు వంటి చాలా ఖ‌ర్చులు ఉంటాయి క‌దా. మ‌రి వాటికి డ‌బ్బులు లేవ‌ని చెప్పి సింపుల్‌గా రూ.500తోనే వివాహం కానిచ్చేశారు. మ‌రి ఆ రూ.500 కూడా ఎందుకు ఖ‌ర్చయిందంటే పెళ్లికి వ‌చ్చిన అతిథులుకు టీ, మంచినీళ్ల కోసం. అందుకోస‌మే వారు ఆ రూ.500 ల‌ను ఖ‌ర్చు చేశారు. దీంతో ఇప్పుడీ జంట పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అయితేనేం నోట్ల ర‌ద్దు కార‌ణంగా ల‌క్ష‌లు వెచ్చించాల్సిన బాధ త‌ప్పింది. ఎంతో డ‌బ్బు ఆదా అయింది క‌దా. దాంతో ఇక ఆ జంట ఏం చేస్తుందో చూడాలి. మ‌రి… ఈ పెళ్లిని చూసిన గాలి పార్టీ ఏమంటుందో..! అయినా ఏమంటారు… అవినీతి కోట‌ల‌పై ఆర్జించిన సొమ్ము క‌దా. క‌ష్డ‌ప‌డితే దాని విలువ తెలుస్తుంది. అది తెలియ‌దు క‌నుకే వారు అలా డ‌బ్బును మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేశారు. ఏది ఏమైన ఈ సూర‌త్ జంట మాత్రం పెళ్లి చేసుకోవాల‌నుకునే వారంద‌రికీ ఆద‌ర్శమే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top