40 ఏళ్లుగా ప్ర‌తి 3 నెల‌ల‌కోసారి ర‌క్త‌దానం చేస్తున్న సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్‌..!

ర‌క్త‌దానం వ‌ల్ల ఎంత ఉప‌యోగం ఉంటుందో అంద‌రికి తెలిసిందే. దాంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారిని ర‌క్షించ‌వ‌చ్చు. త‌ల‌సేమియా లాంటి ర‌క్త సంబంధ వ్యాధుల‌తో బాధ ప‌డే వారికి ర‌క్త‌దానం వ‌ల్ల వ‌చ్చే ర‌క్తం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వారి ప్రాణాల‌ను నిలుపుతుంది. అయితే మ‌న స‌మాజంలో ర‌క్త‌దానం చేసే వారు చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఎవ‌రైనా త‌మ కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల‌కు అవ‌సరం ఉంటే త‌ప్ప సాధార‌ణంగా ర‌క్త‌దానం చేయ‌డం లేదు. ఎవ‌రో కొంద‌రే అలా చేస్తున్నారు. అలాంటి కొంద‌రిలో ఆయ‌న కూడా ఉన్నారు. అయితే ఆయ‌న అంద‌రి లాంటి సాధార‌ణ పౌరుడు కాదు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిసే. అంత‌టి అత్యున్న‌త ప‌ద‌విలో ఉండి కూడా ఆయ‌న ర‌క్త‌దానం చేయ‌డం మాత్రం ఆప‌డం లేదు.

jagdish-singh-khehar

ఆయ‌న పేరు జ‌గ‌దీష్ సింగ్ ఖెహ‌ర్‌. ఈ మ‌ధ్యే ఆయ‌న సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియామ‌కం అయ్యారు. 2017 ఆగ‌స్టు 28వ తేదీ వ‌ర‌కు ఆయ‌న ఆ ప‌దవిలో కొన‌సాగ‌నున్నారు. అయితే జ‌గ‌దీష్ సింగ్ ఖెహ‌ర్ న్యాయ‌మూర్తిగా పౌరులకు న్యాయం అందిండంలోనే కాదు, సామాజిక సేవ‌లోనూ ముందే ఉన్నారు. గ‌త 40 ఏళ్లుగా ఆయ‌న రక్త‌దానం చేస్తూ వ‌స్తున్నారు. అది కూడా 3 నెల‌ల‌కు ఓసారి కావ‌డం విశేషం. 3 నెల‌లు అయిందంటే చాలు ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్నా ఆయ‌న క‌చ్చితంగా ర‌క్త‌దానం చేస్తారు. ఆయన ఎప్పుడూ న్యూఢిల్లీలో ఉన్న అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ‌లోనే ర‌క్తదానం చేస్తున్నారు.

ఎంత ఉన్న‌త స్థానంలో ఉన్నా ప్ర‌తి ఒక్క‌రు క‌నీస సామాజిక బాధ్య‌త‌ను మ‌రువ‌కూడ‌ని జ‌గ‌దీష్ సింగ్ చాటి చెబుతున్నారు. ఈ వ‌య‌స్సుకు వ‌చ్చాక కూడా ఇంకా ఆయ‌న ర‌క్త‌దానం చేయ‌డం మాన‌లేదంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మే మ‌రి..! ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న్ను ఆదర్శంగ తీసుకుంటే దాంతో ఎంతో మందికి మేలు చేసిన వార‌మ‌వుతాం. కానీ ఆ అవ‌గాహ‌న అంద‌రిలో వ‌స్తుందా..? ఏమో మ‌రి… చూద్దాం..! అన్న‌ట్టు… ఇంకో విష‌యం… జ‌గ‌దీష్ సింగ్ అలా ర‌క్త‌దానం చేస్తుండ‌డం ఆయ‌న‌కు తప్ప ఇంకెవ‌రికీ తెలియ‌దు. ఈ సంగ‌తి ఈ మ‌ధ్యే బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది..!

Comments

comments

Share this post

scroll to top