మీకు తెలుసా..? సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హాలీవుడ్‌లో కూడా న‌టించారు..! ఆ సినిమా ఏంటంటే..?

ర‌జ‌నీకాంత్… పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు ఇది. అందుకు కార‌ణం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు ఉన్న అభిమానులే. ఇటీవ‌లే రిలీజైన ర‌జ‌నీ లేటెస్ట్ సినిమా అభిమానుల‌ను ఎంత‌గా అల‌రించిందో అంద‌రికీ తెలిసిందే. క‌లెక్ష‌న్స్‌లోనూ ఈ సినిమా జోరుగానే ముందుకు వెళ్తోంది. క‌బాలి సృష్టించిన హైప్ అంత‌టిది మ‌రి. అయితే ఇక్క‌డ మ‌నం ర‌జ‌నీ గురించి చెప్పుకోవాల్సిన విష‌యం ఇంకొక‌టుంది. అదే ఆయ‌న ఫిలిం కెరీర్‌.

rajnikanth-hollywood

త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో ర‌జ‌నీ అనేక చిత్రాల్లోనే న‌టించారు. అయితే అవే కాకుండా దాదాపుగా చాలా మందికి తెలియ‌ని విష‌యం ఇంకోటుంది. అదేమిటంటే ర‌జ‌నీ హాలీవుడ్ ఎంట్రీ. అదేంటీ, ఆయ‌న హాలీవుడ్ చిత్రంలో ఎప్పుడు న‌టించారు, అనేగా మీ డౌట్‌. కానీ నిజంగానే ఆయ‌న హాలీవుడ్ చిత్రంలో న‌టించారు. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. అయితే మ‌రి ఆ సినిమా ఏంట‌ని అడ‌గ‌బోతున్నారా, ఇంకెందుకాల‌స్యం, అదేంటో మీరే చూడండి..!

అది 1988ల నాటి మాట‌… వైట్ హెచ్ లిటిల్ అనే డైరెక్ట‌ర్ దర్శ‌క‌త్వంలో బ్ల‌డ్‌స్టోన్ అనే ఆంగ్ల సినిమా వ‌చ్చింది. అందులో ర‌జ‌నీ న‌టించారు. ఈ చిత్ర క‌థేంటంటే… అమెరికాకు చెందిన ఇద్ద‌రు దంప‌తులు త‌మ హ‌నీమూన్ ట్రిప్ కోసం దక్షిణ భార‌త్‌కు వ‌స్తారు. అయితే వారు అనుకోకుండా ఓ రూబీ డైమండ్ కోసం వెద‌క‌డం ప్రారంభిస్తారు. వారికి ఓ టాక్సీ డ్రైవ‌ర్ స‌హాయం చేస్తాడు. అత‌నే మ‌న ర‌జ‌నీ. కానీ ఆ సినిమా అంత‌గా ఆకట్టుకోలేదు. అయితే ర‌జ‌నీ మాత్రం హాలీవుడ్‌లో న‌టించ‌డం అదే మొద‌టి, ఆఖ‌రి సినిమా. కానీ ఆయ‌న ఆ చిత్రంలో న‌టించినందుకు ఎంత‌గానో ఆనందించార‌ట‌.

ర‌జ‌నీకాంత్ న‌టించిన బ్ల‌డ్‌స్టోన్ సినిమాను వీక్షించాల‌నుకుంటే కింది యూట్యూబ్ వీడియోలో చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top