చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సినిమా రానుంది. ఇదిగో ఆ సినిమా ట్రైలర్.

అభ్యుదయ మహాకవి శ్రీశ్రీ రచనలు భగభగమండే సూర్యుడిలా ఉంటాయి. ఇప్పుడు తెలుగులో ‘శ్రీశ్రీ’టైటిల్ తో ఓ  సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సిస్టం ఫెయిలైనప్పుడు సొసైటీ నుంచి నాలాంటి శ్రీశ్రీలే పుట్టుకొస్తారంటూ’ తనకు జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి కథే శ్రీశ్రీ. ప్రతీకారం ఎప్పటికీ పాతబడదు అంటూ ముప్పలనేని శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సూపర్ స్టార్ కృష్ణ 1965లో సినీ రంగప్రవేశం చేసి, 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరాటీలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకు రీమేక్ గా ‘శ్రీశ్రీ’ తెరకెక్కుతోంది. చాలాకాలం గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో నటిస్తుండగా, విజయనిర్మల కృష్ణ సరసన నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 48వ చిత్రం ‘శ్రీశ్రీ’. రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నరేష్, మురళీశర్మ, సాయికుమార్ కీలకపాత్రలు పోషించగా, సుధీర్ బాబు ప్రత్యేకపాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్ర ఆడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Watch SriSri Movie Trailer:

Comments

comments

Share this post

scroll to top