అతడి చివరి కోరిక సన్నీ లియోన్ తో గడపడం. సన్నీలియోన్ వచ్చింది, కానీ అతడు చచ్చాడు.!!

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కు కారణం ఈ మాటలు నేడు కామన్ అయిపోయాయి. సిగరెట్ ఫ్యాకెట్ మీద అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నా లైట్ తీసుకొని లైటర్ తో కింగ్ సైజ్ సిగర్ ను చాలా స్టైల్ గా తాగేవాళ్లే అనేకం. అలాంటి వారి కోసం పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫస్ట్ టైమ్ సమాజ హితాలన్ని కోరి ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది.  ‘నో  స్మోకింగ్ 11 మినిట్స్’ అనే టైటిల్ తో విభుపూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింలో సన్నీలియోన్, అలోక్ నాథ్, దీపక్ దోబ్రియాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక యువకుడు చైన్ స్మోకర్. అతడు ఇంకొన్ని రోజులు మాత్రమే జీవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడి చివరి కోరిక ఏమిటో తెలుసుకుంటారు. సన్నీలియోన్ ను కలవాలని, ఆమెతో శోభనం కావాలని కోరతాడు. ఎలాగోలా సన్నీని ఒప్పించి శోభనం ఏర్పాట్లు చేస్తారు చైన్ స్మోకర్ కుటుంబసభ్యులు. శోభన గదిలోకి సన్నీరాగానే ఆమె అందచందాలకు ముగ్ధుడైన ఆ యువకుడు ఆమెతో గడపకుండానే చనిపోతాడు. ధూమపానం వలన మనిషి తన చివరి కోరికను కూడా  తీర్చుకోలేడని అడల్ట్ రూట్ లో చెప్పాడు దర్శకుడు.

ప్రతి సిగరెట్ మనిషి జీవితంలోని 11 నిముషాలను హరించివేస్తుంది. అందుకే ధూమపానం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని ధూమపానం గురించి మెసేజ్ అందించారు చిత్ర యూనిట్. చాలా సింపుల్ గా తెరకెక్కించి చక్కటి సందేశాన్ని అందించారు చిత్ర యూనిట్ . సిగరెట్ తాగేవారికి,వాళ్ళ పక్కనున్న వారికి ధూమపానం హానికరమే. ఈ విషయాన్ని గుర్తుకు పెట్టుకోండి. ధూమపానానికి దూరంగా ఉండండి.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top