నా అత్త దెగ్గరుండీ బలవంతంగా మా ఆయన తో నన్ను రేప్ చేయించేది..!!

‘వింగ్స్’ పుస్తకం తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సన్నీ ఏంజెల్, సన్నీ ఏంజెల్ అసలు పేరు సునీత. భారత సంతతికి చెందిన సన్నీ ఏంజెల్ బాల్యం నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఖాన్ అనే వ్యక్తి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు, తీవ్రంగా హింసించేవాడు. ఆ విషయం ఇంట్లోవారికి చెప్పుకోలేక కుంగిపోయారు ఆమె. చిన్న వయస్సు లోనే పెళ్లి చేసి మరో నరకానికి పంపారు. ఆ కష్టాలను ఆమె తన పుస్తకం ‘వింగ్స్’ లో వివరించింది.

మా అత్త దెగ్గరుండీ చేయించేది.. :

‘‘అజయ్ అనే మతిస్థిమితం లేని వ్యక్తితో నాకు బలవంతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి రోజు రాత్రి నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అతనితో సెక్స్ చేయించారు. అజయ్‌కు సెక్స్ అంటే ఏమిటో తెలీదు. అతడి తల్లి కార్న్ వీడియోలు చూపించి, సెక్స్ ఎలా చేయాలో చెప్పేది. కిటికీ నుంచి చూస్తూ సూచనలు ఇచ్చేది. ఆ సమయంలో అతను తన దుస్తులు కూడా విప్పేవాడు కాదు. ఎందుకంటే, అతనిలో ఏదో భయం ఉండేది. అత్తా, నాకు ఇది ఇష్టం లేదని ఆమెతో చెబితే, నాకు మనవళ్లు కావాలంటూ నా పైన దాడి చేసేది. నా భర్త నాతో సెక్స్ చేసిన తర్వాత, ‘అమ్మా, చేసేశా చాక్లెట్ ఇస్తావా’ అంటూ వెళ్లిపోయేవాడు’’ అని సన్నీ ఏంజెల్ తెలిపారు.

తిండి పెట్టడం మానేసింది.. :

కొన్ని రోజుల తరువాత మా అత్త నాకు తిండి పెట్టడం మానేసింది, ఆ తరువాత హాస్పిటల్ పాలయ్యాను, పెళ్ళైన 4 నెలల్లోనే విడిపోయాం, కొన్ని రోజుల తరువాత విడాకులు తీసుకున్నాం, నాకు ఎదురైన పరిస్థితి చాలా మందికి ఎదురయ్యాయి, పెళ్లి చేసుకొనే ముందు అజయ్ మతిస్థిమితం లేని వ్యక్తి అని నాకు తెలీదు, కట్నం కింద రూ.9,31,862, మెర్సిడెస్ కారు తీసుకున్నారు. పెళ్ళికి ముందు అజయ్ నాతో మొదటి సారి మాట్లాడినప్పుడు ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. పెళ్లికి ఖర్చులవుతాయని అమ్మ చెప్పిందని తెలిపాడు, అప్పుడు కూడా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలనే నాతో చెప్పాడు. అప్పుడు నాకు అర్ధం కాలేదు తను మతిస్థిమితం లేని మనిషని, ప్రస్తుతం నా వయసు 40 ఏళ్ళు. నేను లండన్ లో ఉంటున్నా, అజయ్ కూడా లండన్ లోనే ఉంటున్నాడు, అతని పైన చర్యలేవి తీసుకోలేదు నేను, ఎందుకంటే తను చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన మనిషి, తప్పంతా వాళ్ళ అమ్మది.

సమాజం లో చాలా మంది ఇలాగె ఉన్నారు.. :

‘సమాజం లో చాలా మంది ఇలాగె ఉన్నారు, పరువు ప్రతిష్ఠా అంటూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు, నా జీవితం కొంత మందికైనా కనువిప్పు అవ్వాలని ఈ పుస్తం రాసాను, ఆడవాళ్ళూ చిన్నప్పటి నుండే ఇబ్బందులు ఎదురుకుంటూ ఎదుగుతారు. ఎదిగేకొద్ది వారిలో ధైర్యం పెరుగుతుంది, ఇబ్బందులను ధైర్యంగా దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి’ అని సన్నీ ఏంజెల్ తెలిపారు.

 

Comments

comments

Share this post

scroll to top