సునిల్ కృష్ణాష్టమి రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)

Poster:
Sunil-Krishnashtami-Movie-Release-Date-Wallpapers-2
Cast & Crew:

నటీనటులు: సునీల్, నిక్కీ గర్లాని, డింపుల్ చోపాడే, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, అశుతోష్ రాణా

దర్శకత్వం:  వాసువర్మ
సంగీతం:   దినేష్
నిర్మాత: ‘దిల్’ రాజు
Story: 
కృష్ణప్రసాద్ (సునీల్)తల్లితండ్రులు చనిపోవడంతో, కృష్ణ పెదనాన్న రామచంద్రప్రసాద్ (ముఖేష్ రిషి) అమెరికాకు పంపించి అక్కడే చదివిస్తాడు. చదువు పూర్తి చేసుకొని యూఎస్ఏలో వీడియో గేమ్ డిజైనర్ గా జాబ్ చేస్తుంటాడు కృష్ణ. 18 సంవత్సరాల నుండి తన కుటుంబానికి దూరంగా ఉన్న కృష్ణ, భారతదేశానికి రావాలని,ఇంట్లో అందరినీ చూడాలని పెదనాన్నకు చెబితే వద్దని వారిస్తాడు రామచంద్రప్రసాద్. ఇక్కడకు రావాలంటే యూఎస్ లో సెటిల్ అయిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెడతాడు. ఎలాగైనా ఇంటికి రావాలనుకొని, తన పెదనాన్నకు తెలియకుండా తన స్నేహితుడు (సప్తగిరి)తో కలిసి ఇండియా బయలుదేరతాడు కృష్ణ. ఈ ప్రాసెస్ లో పల్లవి (నిక్కీ గర్లాని)ని ఎయిర్ పోర్ట్ లో చూసి, ఫ్లైట్ ఎక్కేలోపు తన ప్రేమలో పడేస్తాడు కృష్ణ. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యూరప్ లో ఎదురుచూస్తున్న అజయ్ కుమార్ (అజయ్)కు కృష్ణ   పరిచయం ఏర్పడుతుంది. ఇండియాలో అడుగుపెట్టగానే కృష్ణపై అటాక్ జరుగుతుంది. కృష్ణను కాపాడబోయి అజయ్ కోమాలోకి వెళతాడు. అజయ్ ను హాస్పిటల్ లో చేర్చి, జరిగిన విషయాన్ని అజయ్ కుటుంబ సభ్యులకు చెప్పడానికి వెళ్లి, వారిని చూసి ఆ విషయం చెప్పలేక అజయ్ గానే ఉండిపోతాడు. కృష్ణకు తన కూతుర్ని(డింపుల్ చోపాడే)ను  ఇచ్చి పెళ్లి చేయాలని ఆ ఇంటిపెద్ద (అశుతోష్ రానా) అనుకుంటుండగా, అసలు నిజం చెప్పేసి వెళ్లిపోవాలనుకున్న టైంలో మళ్ళీ అటాక్ జరుగుతుంది. అసలు కృష్ణపై అటాక్ చేస్తున్నది ఎవరు? కృష్ణ పెదనాన్న తనను ఇండియా ఎందుకు రాకుండా అడ్డుకున్నాడు?అజయ్, కృష్ణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
PLUS POINTS:
  • సునీల్
  • కామెడీ
  • సినిమాటోగ్రఫీ
  • సినిమా రన్ టైం
MINUS POINTS:
  • రొటీన్ స్టోరీ
  • ఫస్ట్ హాఫ్
  • సాంగ్స్
  • డైరెక్షన్
Verdict: కుటుంబకథా చిత్రం ‘కృష్ణాష్టమి’
Rating:  2.5/5
Trailer:

Comments

comments

Share this post

scroll to top