నిన్నటి బిగ్ బాస్ లో హైలైట్ ఇదే…సందడి చేసిన ఉంగరాల రాంబాబు.!”అర్చన” కి బత్తాయి మసాజ్ చేసిన “శివబాలాజీ”!!

బిగ్ బాస్ భారీ అంచనాల మధ్య మొదలైన తెలుగు కార్యక్రమం..ముగింపు దశకు చేరుకుంది.మొదట్లొ అంతగా ఆకట్టుకోని ప్రోగ్రాం అయిపోవడానికి వస్తున్న ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి..కంటెస్టంట్స్ ఫెర్ఫార్మెన్స్ పోటీలో కొనసాగి టైటిల్ నెగ్గాలనే  ఆరాటం.మరోవైపు సినిమా ప్రమోషన్లో భాగంగా ఎంటర్ అయ్యే హీరో హీరోయిన్లు,కంటెస్టెంట్స్ ఫ్యామిలి మెంబర్ల ఎంట్రీ,.బిగ్ బాస్ ఇస్తున్ వెరైటీ టాస్క్ లు కూడా ప్రోగ్రాంని ఆసక్తికరంగా మారుస్తున్నాయి…

ఉంగరాల రాంబాబు సందడి..

ఇంతకుముందు రాణా,విజయ్,తాప్సీ వారి వారి సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశిస్తే  ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లోకి సునీల్   ఎంటర్ అయ్యారు.ఉంగరాల రాంబాబు కంటెస్టెంట్స్ కి ఉంగరం ఇచ్చి అది పెట్టుకున్న వారిన క్వశ్చన్ చేయడం దానికి వారు నిజం మాత్రమే చెప్పడం అనేది ఈ వారం టాస్క్..అందులో భాగంగా అర్చనని మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరూ అని అడగ్గా ,తడుముకోకుండా దీక్షా అని చెప్పేసింది.నవదీప్ ని డార్లింగ్ అని సునీల్ సంభోదించడం వారి మధ్య క్లోజ్నెస్ ని తెలిపింది. శివబాలాజీ కోపం గురించి, ఆదర్శ్ గతంలో కంటే ఇప్పుడు ఎందుకు డల్ అయ్యావని వివరాలు అడిగితెలుసుకున్నారు సునీల్.. ఇక ఉంగరాల రాంబాబు హౌస్‌కి వచ్చిన టైం పూర్తి కావడంతో బిగ్ బాస్ కన్టెస్టెంట్స్‌తో సెల్ఫీ దిగి బిగ్ బాస్ హౌస్‌ను వీడారు సునీల్.

ఎపిసోడ్ హైలైట్స్ ..

  •  బిగ్‌బాస్ హౌస్‌ను కిచెన్ కోచింగ్ సెంటర్‌‌గా మార్చి తమకు దోసెలు వేయడం, వంటలు చేయడం నేర్పించిన శివబాలాజీని ఆటపట్టించింది హరితేజ. దీక్షకు కూడా దోసెలు ఎలా వేయాలో ట్రైనింగ్ ఇచ్చారు శివబాలాజీ.
  •  బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి 62 రెండు రోజులు పూర్తైన సందర్భంగా ఇంటితో వారికున్న అనుబంధాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో తమకు ఇష్టమైన ప్రదేశాన్ని గురించి, వస్తువులను గురించి ఒకరి తరువాత ఒకరు తమ మెమెరీస్‌ను పంచుకున్నారు.
  • శివబాలాజీ అర్చన వీపు నొప్పిను మాయం చేసేందుకు ‘బత్తాయి మసాజ్’ చేయడం ఈ వారం హైలైట్ అని చెప్పొచ్చు.. రెండు చేతులతో రెండు బత్తాయిలను పట్టుకుని అర్చన వీపుపై మసాజ్ చేస్తుంటే.. నువ్ ఇలా బత్తాయి మసాజ్ చేస్తుంటే కళ్లు అలా మూసుకుపోతున్నాయ్ శివ అని.. హాయిగా ఉందంటూ అర్చన తెగ ఎంజాయ్ చేసింది.
  • అర్చన,దీక్ష,ఆదర్శ్,హరితేజ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు..వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ,ముందు ముందు ఎలాంటి టాస్క్ లు బిగ్ బాస్ ఇస్తారో..చూడాలి

watch video here:

https://www.youtube.com/watch?v=c84_4tveARI

Comments

comments

Share this post

scroll to top