వరుస ప్లాప్స్ ఎదురుకున్న “సునీల్” కి “2 కంట్రీస్” హిట్ ఇచ్చిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): 2 కంట్రీస్

Cast & Crew:

  • నటీనటులు: సునీల్, మనీషా రాజ్ తదితరులు
  • సంగీతం: గోపి సుందర్
  • నిర్మాత:మహాలక్ష్మి ఆర్ట్స్
  • దర్శకత్వం: ఎన్.శంకర్

Story:

ఉల్లాస్ కుమార్(సునీల్) ఆవారాగా తిరుగుతుంటాడు. డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని స్థిరపడిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో పటేల్(షాయాజీ షిండే) అనే వడ్డీ వ్యాపారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. అదే సమయంలో పెళ్లిళ్ల బ్రోకర్ సహాయంతో లయ(మనీషా) అనే అమ్మాయితో మాట్లాడతాడు ఉల్లాస్. లయ కుటుంబం అమెరికాలో స్థిరపడుతుంది. ఉల్లాస్‌తో పెళ్లికి లయ సిద్ధమవుతుంది. దీంతో పటేల్ చెల్లెలితో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని లయను పెళ్లి చేసుకుంటాడు ఉల్లాస్. తన చెల్లెల్ని కాదన్నందుకు పటేల్.. ఉల్లాస్‌పై పగ పెంచుకుంటాడు.

లయను పెళ్లి చేసుకున్న ఉల్లాస్‌కు కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. లయ పెద్ద తాగుబోతు. కుటుంబ పరిస్థితుల కారణంగా మందుకి బానిస అవుతుంది. పెళ్లి తరువాత కూడా దాన్నే కొనసాగిస్తుంది. ఇది ఉల్లాస్‌కు నచ్చదు. ఆమెతో తరచూ గొడవ పడుతుంటాడు. దీంతో అమెరికాకు తీసుకెళ్లి ఎయిర్‌పోర్ట్‌లోనే ఉల్లాస్‌ను వదిలేసి వెళ్లిపోతుంది లయ. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి..? ఉల్లాస్ తన భార్యను మార్చుకోగలిగాడా..? పటేల్.. ఉల్లాస్‌పై పగ తీర్చుకున్నాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

Review:

ఎప్పటిలానే సునీల్ స్టయిల్ గా కనిపించే బట్టలతో, తన మార్క్ కామెడీ పండించాలని తెగ ట్రై చేశాడు. కానీ ఏది కూడా వర్కవుట్ కాలేదు. సునీల్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా చికాకు కలిగిస్తుంది. సీనియర్ నటుడు నరేష్, కమెడియన్ పృధ్వీ, రాజా రవీంద్ర, శ్రీనివాస రెడ్డి ఇలా ఒకరా ఇద్దరా భారీ కాస్టింగ్ ను అయితే దర్శకుడు సినిమాలో పెట్టాడు. కానీ ఏ ఒక్క పాత్ర కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వదు. పృధ్వీ చేసే కామెడీ నాసిరకంగా అనిపిస్తుంది. సునీల్ కూడా ప్రేక్షకులను నవ్వించడానికి నానా తిప్పలు పడ్డాడు. హీరోయిన్ మనీషాకు మొదటి సినిమానే అయినా తన నటనతో పర్వాలేదనిపించింది. సితార, ఝాన్సీ, కృష్ణభగవాన్, షాయాజీ షిండే తమ పాత్రలపరిధుల్లో ఓకే అనిపించారు.
ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏవీ సరిగ్గా కుదరలేదు. సక్సెస్ అయిన కథను ఎన్నుకున్నప్పటికీ దర్శకుడు తెరపై దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. రొటీన్ ఫార్మాట్‌తో ఫస్ట్‌హాఫ్ ఎలాగోలా కానిచ్చేశారు. అసలు కథ సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. అమెరికాలో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు, అవి విడాకులకు దారి తీయడం, కోర్టులో ఆ విడాకుల కేసు వాదించడం ఈ విషయాలన్నీ విసుగు పుట్టిస్తాయి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీను దించి కామెడీ పెంచాలని అనుకున్నారు కానీ సరైన సన్నివేశాలు లేకపోవడంతో అది అపహాస్యం అయ్యింది.
కథను అటు ఇటు చేసి ఎటో తీసుకెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎన్.శంకర్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. వెనుకాడకుండా ఖర్చు పెట్టారు. కానీ దానికి సరైన న్యాయం చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగానే ఉన్నా.. లొకేషన్స్‌ను సరిగ్గా చూపించలేకపోయారు. పాటలు ఆకట్టుకోలేదు. తనకు సెట్ కానీ కథ, కామెడీ కవరింగ్‌తో కమర్షియల్ సినిమాను ప్రయత్నించి దర్శకుడిగా ఎన్.శంకర్ ఫెయిల్ అయ్యారు. దాని కారణంగా సునీల్ ఈ మధ్య కాలంలో చేసిన ఫ్లాప్ సినిమాల జాబితాలోకి ‘2 కంట్రీస్’ కూడా చేరింది.

Plus Points:

విసుఅల్స్

Minus Points:

రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
రొటీన్ కామెడీ

Final Verdict:

ఒక్క మాటలో చెప్పాలంటే.. బాగా విసిగించాడు.

AP2TG Rating: 1.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top