సందీప్ కిషన్, రెజీనా “నగరం” తో మరోసారి హిట్ కొట్టారా?…స్టోరీ, రివ్యూ, రేటింగ్ (తెలుగులో)

Movie Title: నగరం (Nagaram)

Cast & Crew:

 • నటీనటులు: సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా, శ్రీ, చార్లె
 • దర్శకుడు: లోకేష్ కానగరాజ్
 • సంగీతం: జావేద్
 • నిర్మాత: ఎస్. ఆర్. ప్రభు (పోటెటిల్ స్టూడియోస్)
 • సినిమాటోగ్రఫీ: సెల్వ కుమార్

Story:

హైదరాబాద్ సిటీ కి వచ్చిన నలుగురి కథ చుట్టూ సినిమా తిరుగుతుంది. శ్రీ, హైదరాబాద్ లో ఐటీ జాబ్ చేయడానికి వస్తాడు. సందీప్ కిషన్, తను ప్రేమించిన అమ్మాయి (రెజీనా కాసాండ్రా) కోసం హైదరాబాద్ కి వస్తాడు. ఓ టాక్సీ డ్రైవర్ తన కొడుకుకి మెడికల్ ట్రీట్మెంట్ చేయించడానికి హైదరాబాద్ కి వస్తాడు. మరొక పోలీస్ ఆఫీసర్ మాఫియా తో చేయి కలపడానికి హైదరాబాద్ కి వస్తాడు. ఇలా ఈ నలుగురు నగరంలో ఎలాంటి సమస్యలు ఎదురుకున్నారు. చివరికి వారందరు ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే “నగరం” సినిమా చూడాల్సిందే!

Review:

మానగరం అనే తమిళ్ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ “నగరం” సినిమా. తమిళ్ లో మంచి హిట్ టాక్ వచ్చేసింది. నలుగురి కథను ముడివేస్తూ మొదటి నుండి చివరి దాకా ఆడియన్స్ ని సినిమాలో లీనం అయిపోయేలా చేస్తుంది “నగరం”. కొత్త కథతో కొత్త టాలెంట్ ను చూపించారు ఈ సినిమాతో. సందీప్ కిషన్ లుక్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రామ్ దోస్ కామెడీ ఈ సినిమాకి చాలా హైలైట్ అయ్యింది. నలుగురి కథను చూపించిన స్క్రీన్ప్లే బాగుంది. మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది.

Plus Points:

 • సందీప్ పెరఫామెన్స్
 • రెజీనా గ్లామర్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • సినిమాటోగ్రఫీ
 • స్క్రీన్ ప్లే

Minus Points:

 • చూపించింది మళ్ళీ మళ్ళీ చూపించడం

Final Verdict:

నగరంకి వచ్చిన నలుగురి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి చెపుతూ ఎమోషనల్, థ్రిల్, సెంటిమెంట్ లను తగిన మోతాదులో సినిమాలో చూపించి. సందీప్ కొత్త స్టైల్ కి, రెజీనా గ్లామర్ ఆడ్ చేసి సినిమా చూసే ఆడియన్స్ ని సినిమాలో నిమగ్నం అయ్యేలా చేస్తుంది “నగరం”. క్రైమ్ థ్రిల్లెర్స్ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా “నగరం”

AP2TG Rating: 3.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top