మన వంటింట్లోకి వచ్చిన ఫస్ట్ మిక్సీ గురించి మీకు తెలుసా?

60’S కాలం ..అప్పుడప్పుడే ప్రపంచం టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న రోజులు….సాంకేతిక విప్లవం పేరుతో మానవ శ్రమను తగ్గించడానికి కొత్త కొత్త వస్తువులు మార్కెట్ ప్రవేశం చేస్తున్నాయి. అలాంటి సమయంలోనే వంటింట్లో పెను విప్లవాన్ని తీసుకొచ్చింది ఓ పరికరం…అదే మిక్సీ…… గంటన్నరకు పైగా పట్టేపనిని రయ్  మంటూ 3 నిమిషాల్లో ముగించేస్తూ… గృహిణుల మన్ననలను పొందుతూ వారి శ్రమను తగ్గిచింది.  ఇప్పుడున్నని బ్రాండ్ లు అప్పుడు లేవు. ఒక్కటే బ్రాండ్….ఈటా సబ్బులాగా….అంబికా దర్భార్ బత్తిలాగా….ఎవ్వరింట్లో చూసినా అదే బ్రాండ్ మిక్సీ….రయ్ మంటూ తిరుగుతూ  దోశ, ఇడ్లీల కోసం పిండిని, వాటికి అవసరమైన చట్నీని రుబ్బుతుండేవి.

అవే సుమీత్ మిక్సీలు…అప్పట్లో వీటి పేరు తెలియని వారు లేరంటే నమ్మండి. మిక్సీ అంటే సుమీత్…సుమీత్ అంటే మిక్సీ అనే స్థాయికి చేరింది. ఏమయ్యిందో ఏమోకానీ.. ఒక్కసారిగా కనుమరుగైపోయాయి సుమీత్ మిక్సీలు….మల్లీ చాలా గ్యాప్ తీసుకొని ఫ్రెష్ గా ఇప్పుడు మార్కెట్ లో వచ్చేశాయ్ …సుమీత్ మిక్సీ పేరు ఎంత ఫేమస్ అంటే….తరతరాలుగా ఆ బ్రాండ్ కు ఉన్న పేరునే  ఆసరాగా చేసుకొని చాలా ఫేక్ సంస్థలు సుమీత్ అనే బ్రాండ్ కు ఏదో ఒక తోక తగిలించి ఆన్ లైన్ అమ్మకాలు చేపట్టి లాభాలు గడించాయి.

Sumeet-Grinderman-3 (1)

ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మన అమ్మమ్మల రోటి కష్టాలకు చెక్ పెట్టిన సుమీత్ మిక్సీనే  మళ్లీ మార్కెట్ లో అమ్మకానికి సిద్దమయ్యింది. ప్రస్తుత పోటీకి ఏ మాత్రం తగ్గకుండా…అప్పటి విశ్వాసాన్ని మోసుకుంటూ…ఘనమైన గతాన్ని గుర్తుచేసుకుంటూ….అత్యాధునిక సాంకేతికతను అధనంగా జోడించుకుంటూ మీ ఇంటికి రాడానికి రెడీ గా ఉంది. ఓ సారి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను అడిగి చూడండి…వారికి సుమీత్ మిక్సీల గురించి గట్టిగానే తెలిసి ఉంటుంది.

అమ్మమ్మలను అబ్బుర పర్చిన మిక్సీ మరోసారి మార్కెట్ లోకి వచ్చింది. 3699/-నుండి ప్రారంభమైయ్యే ధరల్లో లభిస్తున్నాయి. ఇదిగో ఇది సుమీత్ మిక్సీ డిస్ట్రిబ్యూటర్ నెంబర్.040-23235100  ఒక్క ఫోన్  చేస్తే….వాళ్లే వచ్చి, మీ ఇంట్లో మిక్సీని ఫిట్ చేసి…ఎలా పనిచేస్తుందో వివరించి, మీ ఫీడ్ బ్యాక్ తీసుకొని వెళతారు.అదే నమ్మకంతో మనముందుకు వస్తున్న సుమీత్ మిక్సీ గ్రైండర్స్ కు వెల్ కమ్ చెబుదాం.

 

 

Comments

comments

Share this post

scroll to top