Movie Title (చిత్రం): మళ్లీ రావా (Malli Raava)
Cast & Crew:
- నటీనటులు: సుమంత్, ఆకాంక్ష సింగ్ తదితరులు.
- సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
- నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
- దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
Story:
రాజోలు నుండి వచ్చిన కార్తీక్ (సుమంత్) అనే కుర్రాడి లవ్ స్టోరీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. చిన్నప్పుడే అంజలి (ఆకాంక్ష) తో ప్రేమలో పడతాడు కార్తీక్. కానీ చిన్నప్పుడే అంజలి వాళ్ళ ఫామిలీ రాజోలు వదిలి వెళ్ళిపోతారు. అలా చిన్నప్పుడే దూరమైనా అంజలి కార్తీక్ లు మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తారు. దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా అంజలిని మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు కార్తీక్. చివరికి వారిద్దరూ కలిసారా లేదా అనేది తెలియాలంటే మళ్లీ రావా సినిమా చూడాల్సిందే!
Review:
ఎమోషన్స్, డైలాగ్స్ తో ముందుకొచ్చిన లవ్ స్టోరీ మళ్లీ రావా. శ్రవణ్ అందించిన సంగీతం ఈ సినిమాకి మేజర్ ప్లస్. సుమంత్ యాక్టింగ్ కూడా ప్రశంసనీయంగా ఉంది. ఆకాంక్ష సింగ్ కూడా తెరపై అందరిని ఆకట్టుకుంది. లవ్ స్టోరీ తో సాగే ఈ సినిమాలో పెద్దగా కామెడీ గాని, కమర్షియల్ విలువలు గాని లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి ఫీల్ గుడ్ సినిమా “మళ్లీ రావా”
Plus Points:
డైలాగ్స్
మ్యూజిక్
సుమంత్ పెర్ఫార్మన్స్
హీరో – హీరోయిన్ కెమిస్ట్రీ
స్టోరీ
Minus Points:
స్లోగా సాగిన కథనం
కమర్షియల్ విలువలు లేవు
Final Verdict:
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ముందుకొచ్చిన “మళ్లీ రావా” లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉన్న వారికి తప్పక నచ్చుతుంది!
AP2TG Rating: 2.75 / 5
Trailer: