అప్పుడేమో పెళ్లి కాన్సల్….ఇప్పుడేమో ఫారిన్ గర్ల్ ప్రేమలో అక్కినేని హీరో..! ఆమె ఎవరో తెలుసా?

అక్కినేని హీరో అనగానే నాగ చైతన్య గురించో, అఖిల్ గురించోనని అపార్థం చేసుకోకండి. వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పిన హీరో సుమంత్ గురించి. కీర్తిరెడ్డితో విడాకుల అనంతరం సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే సుమంత్ ఓ ఫారిన్ గర్ల్ ప్రేమలో పడ్డాడని, పీకల్లోతు మునిగి తేలుతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. సుమంత్ ఇటీవల హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో స్టార్‌బక్స్ కాఫీ షాప్‌లో ఓ విదేశీ యువతితో సరదగా ముచ్చటిస్తూ కనిపించాడు. ఈ ఫోటోలు నెట్‌లో వైరల్ అయ్యాయి. అయితే ఏదో ఫ్రెండేమోనని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఐపీఎల్‌లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ ఆడిన మ్యాచ్‌లో కూడా ఈ జంట సందడి చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సుమంత్ మాత్రం తను జస్ట్ ఫ్రెండేనని, గర్ల్ ఫ్రెండ్ కాదని చెబుతున్నాడు.

Comments

comments

Share this post

scroll to top