“1980లో అంత ఓపెన్ గా ముద్దు పెట్టుకునేవారా.?” అని ఇంటర్వ్యూలో అడిగితే..సుకుమార్ ఆన్సర్ హైలైట్.!

ప్రస్తుతం ఏ ఇద్దర్ని కదిపినా ఒకటే చర్చ రంగస్థలం..సోషల్ మీడియాలో కూడా రంగస్థలం హవా నడుస్తుంది. మెగా ఫాన్సే కాదు సినిమా అభిమానులందరు చరణ్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయి,చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చిట్టిబాబు ఒక్కడే కాదు ఆది,సమంతా,జగపతిబాబు,ప్రకాష్ రాజ్ ,అజయ్ ఘోష్,అనసూయ,నరేష్ ,రోహిణి,జబర్దస్త్ నటులు ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.వాళ్లందరి నటన సుకుమార్ టేకింగ్ అదిరిపోవడంతో  ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది. ఇక చిట్టిబాబు – రామలక్ష్మీల మధ్య జరిగిన రొమాంటిక్ ట్రాక్ జనాలను బాగా మత్తెక్కించింది.ఈ సీన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది…

ఈ సినిమాలో చిట్టి బాబు అంటే రామలక్ష్మి ఎంత ఇష్టమో రామలక్ష్మి కి కూడా చిట్టిబాబు అంటే అంటే ఇష్టం ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పండినదని వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ప్రపోజల్ సీన్ ఒకటి క్రియేట్ చేశాడు దర్శకుడు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ సీన్ ఇదే. ఈ సన్నివేశంలో మొదట రామ్ చరణ్ పెదాల మీద ముద్దు పెడుతుంది సమంతా. తర్వాత చెర్రీ కూడా ముద్దును తిరిగిచ్చేస్తాడు…పెళ్లైన నటులు ఇలా చేయోచ్చా,రాంచరణ్ చేస్తే చేసాడు,సమంతా ఇప్పుడు అక్కినేని కోడలు తనెలా చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో కొందరు ఫైర్ అయ్యారు.దానికి సమంతా నేను నటిని ,నా నటనకు న్యాయం చేశాను అని కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చింది.అలాగే ఇటీవల సుకుమార్ కి ఇదే ప్రశ్న ఎదురైంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 1980లో అలాంటి వాతావరణం ఉండేదా అని అడిగిన క్వశ్చన్కి సుకుమార్ చాలా స్పాంటేనియస్ గా సమాధానం ఇచ్చారు..1980లో అలాంటి పరిస్థితి ఉండేదో లేదో తెలియాలంటే మీరు ఆ కాలానికి వెళ్లాలి అంటూ సమాధానం ఇచ్చారు.అంతేకాదు పల్లెటూర్లలో మనుషుల మధ్య సంబందాలు  ఎలా ఉంటాయి..రొమాన్స్కి వారి జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారు లాంటి విషయాలు వివరించారు.సుకుమార్ ఏం చెప్పారో వీడియోలో చూడండి. సుకుమార్ చెప్పిన విషయాలను మీరు అంగీకరిస్తారా..

watch video here:

Comments

comments

Share this post

scroll to top