మీ ఇంట్లో అమ్మాయి ఉందా.? అయితే ఈ పథకం మీకోసమే.! ఏడాదికి 1.5 లక్షలు ఎలా పొందాలి అంటే.?

మ‌న దేశంలో బాల బాలిక‌ల నిష్ప‌త్తి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. బాలుర సంఖ్యకు స‌మానంగా బాలిక‌లు లేరు. అంటే.. 1000 మంది బాలుర‌కు 919 బాలిక‌లు మాత్ర‌మే ఉన్నారు. దీన్నిబ‌ట్టే చెప్ప‌వ‌చ్చు మ‌న దేశంలో బాలిక‌ల‌ను సంర‌క్షించుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంత ఉందో. అందుకే దేశ ప్ర‌ధాని మోడీ బాలిక‌ల సంర‌క్ష‌ణ‌కు, లింగ వివ‌క్ష‌త‌ను అంతం చేయ‌డం కోసం, బాలిక‌ల అభివృద్ధి కోసం 2015, జ‌న‌వ‌రి 22వ తేదీన బేటీ బ‌చావో బేటీ ప‌ఢావో కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశపెట్టారు. ఇందులో భాగంగా బాలిక‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న క‌లిగించేందుకు, వారి ఉన్న‌త చ‌దువుల కోసం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీని గురించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కాన్ని ఆడ‌పిల్ల‌లు ఎవ‌రైనా ఉప‌యోగించుకోవ‌చ్చు. అప్పుడే పుట్టిన ఆడ‌శిశువుల నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ప‌థ‌కం వర్తిస్తుంది. వారు ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో తండ్రి లేదా సంర‌క్షుడు/స‌ంర‌క్ష‌కురాలి స‌హాయంతో ఖాతా ఓపెన్ చేసి దాంతోపాటు వారి బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, నివాస దృవీక‌ర‌ణ ప‌త్రం, సంబంధిత ఇత‌ర ప‌త్రాల‌ను స్థానికంగా ఉన్న అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌లో ఇవ్వాలి. దీంతో ఈ ప‌థ‌కంలో వారు చేరిన‌ట్టు అవుతుంది.

సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కంలో భాగంగా త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు బాలిక‌ల పేరిట ఏడాదికి గరిష్టంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు అకౌంట్‌లో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇక ఈ మొత్తానికి ఏడాదికి 9.1 శాత వ‌డ్డీ ల‌భిస్తుంది. దీనికి గాను ఆదాయపు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద ఈ డిపాజిట్ సొమ్ముకు మిన‌హాయింపునిస్తారు. ఇక ఆడ పిల్ల‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వచ్చాక ఉన్న‌త విద్య చ‌దివించే యోచ‌న ఉంటే డిపాజిట్ చేసిన సొమ్ములో 50 శాతం వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. లేదంటే ఒకేసారి పెళ్లికి మొత్తం డ‌బ్బును విత్ డ్రా చేసుకునే వీలు కూడా క‌ల్పించారు. లేదా ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల త‌రువాత‌ డబ్బు విత్ డ్రా చేసుకునే అవ‌కాశం కూడా ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఆడ‌పిల్ల సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అకౌంట్ యాక్టివ్‌గానే ఉంటుంది. దేశంలో ఉన్న ఆడ‌పిల్ల‌ల సంర‌క్ష‌ణ కోసం ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించ‌గా దీన్ని చాలా మంది ఇప్ప‌టికే ఉప‌యోగించుకుంటున్నారు కూడా. క‌నుక మీకు కూడా 10 సంవ‌త్స‌రాలు అంత‌కు త‌క్కువ లోపు వ‌య‌స్సు ఉన్న బాలిక‌లు ఉంటే ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొందండి మ‌రి. ఆడ‌పిల్ల ఎదిగాక వ‌చ్చే ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు ఈ ప‌థ‌కం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top