సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ ఫ్రొఫేసర్.

‘భాను నాకు బ్రతుకుమీద ఆశలేదు భాను,బ్రతకాలన్న ఆశ కోరిక ఏదీ లేదు. చనిపోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశం  తప్ప. నరకం అనుభవించాను భాను, నా వల్ల కాదు. నేను తప్పే చేస్తున్నానో, మంచే చేస్తున్నానో నాకు తెలీదు. కానీ నాకీ బ్రతుకొద్దు, ఈ బ్రతుకు నేను భరించలేను, ఇప్పటికే చాలా నరకం చూశాను, ఇక మాట్లాడే టైం లేదు. నీకు దూరంగా, నీ జ్ఞాపకాలకు దూరంగా.. ఎవర్నీ మోసం చేయడం లేదు, ఎవర్నీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు. నన్ను క్షమించండి.’అంటూ నెల్లూరు జిల్లా కావలికి చెందిన మాధవి అనే ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా  సెల్ ఫోన్ లో రికార్డ్ చేసింది.

నెల్లూరు జిల్లా కావలిలోని డీబీఎస్ కాలేజ్ లో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న మాధవి, గత  రోజులుగా భాను అనే యువకుడిని ప్రేమించింది. ప్రేమలో ఉన్నంతవరకూ మాధవిని సంతోషంగా ఉంచిన భాను, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మాయమాటలు చెబుతూ మొహం చాటేస్తూ ఉండేవాడట. భానునే సర్వస్వంగా భావించిన మాధవి, తన ప్రియుడు నమ్మించి మోసం చేశాడని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు గల కారణాలను మొబైల్ లో సెల్ఫీ వీడియో తీసి తెలిపింది. ఇంక తానెవరికీ ఇబ్బందిగా మారనని, భానుతో ఎవరినీ  పెళ్లికి ఒప్పించాల్సిన అవసరం లేదని, అలాగే ఎవరినీ తప్పుపట్టాల్సిన అంతకంటే లేదని మాధవి అందులో తెలిపింది. ఈ విషయాన్ని మాధవి తల్లితండ్రులు పోలీసులకు తెలుపడంతో కేస్ ఫైల్ చేసుకొని విచారిస్తున్నారు. బాడీని పోస్ట్ మార్టంకు పంపి  వివరాలు తెలిపారు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top