ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచిన సుహాస్ గోపీనాథ్‌

ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో రోజుకో కొత్తద‌నం చోటు చేసుకుంటోంది. ఫార్మాట్‌లు మారుతున్నాయి. సాంకేతిక‌త కొత్త సొబ‌గులు అద్దుతూ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తోంది. మ‌నుషుల‌కంటే రోబోలు రాజ్య‌మేలుతున్నాయి. వాటి ద్వారా ప‌నులు చేయించే స్థాయికి చేరుకున్నాయి కంపెనీలు. మేథో మ‌థ‌నాలు పోటా పోటీగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి దేశం న్యూ నాలెడ్జ్‌ను ఎంక‌రేజ్ చేస్తోంది. గ‌తంలో రాజ్యాల‌ను ఆక్ర‌మించు కోవ‌డం అన్న‌ది మొద‌టి ప్ర‌యారిటీ అయితే.ఇపుడు క‌థ మారింది.టెక్నాల‌జీలో ఎవ‌రు ముందంజ‌లో వుంటే వారే ప్ర‌పంచాన్ని శాసించ‌వ‌చ్చు. అందుకే ప్ర‌తి దేశం త‌న‌కంటూ ఆయుధ సంప‌త్తిని స‌మ‌కూర్చుకుంటేనే అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఐటీ రంగానికి ఇస్తున్నాయి. వంద మంది చేయ‌లేని ప‌నిని ఒక్క రోబో చేస్తోంది. మ్యాన్ ప‌వ‌ర్ రాను రాను త‌గ్గించుకుంటూ టెక్నాల‌జీని అన్ని రంగాల్లో వినియోగించు కోవ‌డం ప్రారంభ‌మైంది. దీంతో కొలువుల కోసం పోటీ పెరిగింది. సాంకేతిక‌త‌ను అంది పుచ్చుకోగ‌లిగితేనే పోటీలో నిల‌బ‌డ‌గ‌లం లేక పోతే వెన‌క‌బ‌డి పోతాం.

suhas gopinath

ఐటి రంగంలో అమెరికాతో ఇండియ‌న్స్ ధీటుగా పోటీ ప‌డుతున్నారు. అత్య‌ధిక కంపెనీలు అక్క‌డే ఉన్నా అందులో మ‌న వారి వాటా 40 శాతానికి పైగా ఉంటోంది. ఇదే అమెరిక‌న్ల‌ను భ‌య‌పెడుతోంది. త‌క్కువ ఖ‌ర్చుకే స‌ర్వీసులు వ‌స్తున్నాయ‌నే నెపంతో ఆయా కంపెనీలు భార‌తీయుల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. వీరికి ఇంగ్లీష్‌లో ప‌ట్టు ఉండ‌డం.దేనినైనా త్వ‌ర‌గా నేర్చుకునే నేర్పు క‌లిగి ఉండ‌డంతో ఇండియ‌న్స్ ఇర‌గ దీస్తున్నారు. దీనిని గ‌మ‌నించిన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆంక్ష‌లు అధికం చేశారు. ఐటీ కంపెనీలు మాత్రం డోంట్ కేర్ అంటున్నాయి. అమెరికా ఆదాయానికి మ‌న వాళ్లు గండి కొడుతున్నార‌నేది వారి ఆరోప‌ణ‌. వ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ యువ‌తీ యువ‌కులు ఆవిష్క‌ర‌ణ‌ల వైపు మ‌ళ్లుతున్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత చిన్న వ‌య‌సులో ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా బెంగ‌ళూరు న‌గ‌రానికి చెందిన సుహాస్ గోపీనాథ్ ఎంపిక‌య్యారు.

చిన్న‌ప్పుడే ఆడుకోవ‌డానికి వాళ్ల నాన్న కంప్యూట‌ర్ ఇచ్చాడు. అదే అత‌డిని టెక్నాల‌జీలో రారాజుగా నిల‌బ‌డేలా చేసింది. గ్లోబ‌ల్స్ ఇంక్ పేరుతో ఐటీ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో వంద‌లాది మంది కొలువు తీరారు. 14 ఏళ్ల‌ప్పుడే కూల్ హిందూస్థాన్ పేరుతో స్టార్ట్ చేశాడు. వెబ్ సైట్స్‌ను త‌యారు చేయ‌డం.చిన్న‌పాటి సంస్థ‌ల‌కు పోర్ట‌ల్స్‌ను ఎలా అమ్మాలి అనే విష‌యాన్ని తానే స్వంతంగా నేర్చుకున్నాడు. ఎవ్వ‌రి ద‌గ్గ‌ర ట్రైనింగ్ పొంద‌లేదు. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌కు త‌న కంపెనీ ద్వారా స‌ర్వీసులు అందించ‌డం స్టార్ట్ చేశాడు. ఇపుడు కోట్ల‌ల్లోకి చేరుకుందీ ఈ సంస్థ‌. 2005లో క‌ర్ణాట‌క రాష్ట్ర స‌ర్కార్ అత్యున్న‌త రాజ్యోత్స‌వ అవార్డుకు గోపీనాథ్‌ను ఎంపిక చేసింది. ఈ పుర‌స్కారాన్ని అందుకున్న వారిలో అత్యంత పిన్న వ‌య‌స్కుడు ఇత‌డే. 2007లో బ్ర‌స్సెల్‌లో జ‌రిగిన యూరోపియ‌న్ పార్ల‌మెంట్‌లో యంగ్ అచీవ‌ర్ అవార్డును యూరోపియ‌న్ పార్ల‌మెంట్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఫ‌ర్ హ్యూమ‌న్ వాల్యూస్ బ‌హూక‌రించింది. అక్క‌డి పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో పాటు వ్యాపార‌వేత్త‌ల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించాల్సిందిగా ఆహ్వానించారు. 2008లో ఆఫ్రికా ఖండంలోని దేశాల‌లో ఉపాధి క‌ల్పించ‌డం.విద్యార్థుల్లో ఐసీటీ నైపుణ్యాల‌ను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఐసీటీ లీడ‌ర్ షిప్ రౌండ్ టేబుల్‌లో ప్రాతినిధ్యం వ‌హించాల్సిందిగా ప్ర‌పంచ బ్యాంకు కోరింది.

2008-2009లో దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరంలో యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా గోపీనాథ్‌ను ప్ర‌క‌టించారు. ఈ ప‌ద‌విలో సుహాస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటాడు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలోని హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్ నుంచి గ్లోబ‌ల్ లీడ‌ర్ షిప్‌, ప‌బ్లిక్ పాల‌సీల‌పై డిప్లొమా పూర్తి చేశాడు. బీబీసీ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్ట్రాటిస్‌, ద ఏజ్‌, త‌దిత‌ర మీడియా దిగ్గ‌జాలు సుహాస్‌ను గుర్తించి గౌర‌వించాయి. ఇండియా, ఆఫ్రికా, ఆసియా, మ‌ధ్య అర‌బ్ కంట్రీస్‌లలో ప్రోగ్రామ‌ర్‌గా పేరు సంపాదించారు. ఇన్నోవేష‌న్ టెక్నాల‌జీ, కో క్రియేటెడ్ ఎడ్యూక్యూబ్ పేరుతో న్యూ ఇన్నోవేష‌న్ క‌నుగొన్నాడు సుహాస్‌. పిన్న వ‌య‌సులోనే ఎన్నో ఉన్న‌త‌మైన ప‌ద‌వులు అధిరోహించాడు. ఐసీటీ అడ్వ‌యిజ‌రీ బోర్డు మెంబ‌ర్‌గా, వ‌ర‌ల్డ్ బ్యాంక్ లో మెంటార్‌గా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీలో స‌ల‌హాదారుగా, సోష‌ల్ పీస్ ఫౌండేష‌న్‌లో స‌భ్యుడిగా, ఐఐటీ బొంబాయి ఆంట్ర‌ప్రెన్యూర్‌షిప్ సెల్‌లో స‌భ్యుడిగా సేవ‌లు అందిస్తున్నారు. ఆస్ట్రియా నుండి ఇటీవలే ఇన్‌క్రెడిబుల్ యూరోప్ అవార్డు అందుకున్నారు. సింగ‌పూర్ నుండి సోష‌ల్ ఇన్నోవేట‌ర్‌గా పుర‌స్కారం పొందారు.

గ్లోబ‌ల్స్ ఇంక్ కంపెనీకి సుహాస్ గోపీనాథ్ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా. వినీత్ కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆప‌రేష‌న్స్ హెడ్‌గా లోకేష్ కుమార్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న‌త‌నం నుండే టెక్నాల‌జీలో న్యూ ట్రెండ్స్‌కు ఆద్యుడైన సుహాస్ సాధించిన విజ‌యాలు, అందుకున్న పుర‌స్కారాలు, అవార్డులు..అమెరికా జ‌పం చేస్తున్న ప్ర‌బుద్దుల‌కు జ్ఞానోద‌యం కావాలి. ఒక‌రికింద ప‌నిచేయ‌డం కంటే తామే ప‌ది మందికి ప‌ని ఇచ్చే స్థాయికి చేరుకునేలా ఎద‌గాలి.!

Comments

comments

Share this post

scroll to top