సుధాకర్…..సినీ ఇండస్ట్రీలో రెండవ తరంలోని హాస్య విభాగాన్ని తన భుజాలపై మోసిన కామెడీ కింగ్. అయ్యో అయ్యయ్యో అంటూ, నాలుక కరుచుకుంటూ అతడు చేసిన కామెడీ అంతా ఇంత కాదు. భిష భిష అంటూ తనకు మాత్రమే సొంత మైన ఆహాబావాలతో వెండితెర పై నవ్వులు పంచిన నటుడు ఆయన.తొలినాల్లల్లో చిరంజీవి , సుధాకర్ ఒకటే అద్దె గదిలో ఉంటూ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించారట.
2 సార్లు నంది అవార్డ్ చేజిక్కించుకున్న సుధాకర్, ఒక్కసారిగా వెండి తెరకు దూరమయ్యారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. జీవితపు చివరి అంచుల్లో ఉన్నాడని అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో ఓ టాక్ నడిచింది. కానీ ఊహించని విధంగా సుధాకర్ తన సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న “వాడు నేను కాదు” అనే చిత్రం లో హీరోకు మేనమామగా, కథతో లింకున్న ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు సుధాకర్.
అనారోగ్య కారణాల వల్ల చాలా కాలంగా ఇంట్లో ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్లకే పరిమితమైన ఆయన ఇన్నాళ్ళకు మళ్ళీ షూటింగ్కు స్పాట్ కు చేరుకొని బిజిబిజీగా గడిపేస్తున్నారు. ‘‘ఇప్పుడు చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఐయామ్ ఫిట్ ఎగైన్ నౌ’’ అంటూ సుధాకర్ వెల్లడించారు.మునుపటి సుధాకర్ ను తలపించేలా తన మార్క్ కామెడీ కి రెడీ అవుతున్న సుధాకర్ కు మనం ఆల్ ది బెస్ట్ చెబుదాం…