ఆమె కోటీశ్వ‌రురాలు…అయినా…21 సంవ‌త్స‌రాల నుండి ఒక్క చీర కూడా కొన‌లేదు! ఎందుకో తెలుసా?

సాధార‌ణంగా మ‌హిళ‌ల‌కు షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొన్ని గంట‌ల పాటు ప్ర‌పంచాన్ని మ‌ర‌చిపోయి షాపింగ్ చేస్తార‌ని జోకులు కూడా వారి మీద పేలుతాయి. ఈ క్ర‌మంలోనే చాలా వ‌ర‌కు షాపింగ్ చేసే మ‌హిళ‌లు దుస్తుల‌ను ఎక్కువ‌గా కొంటుంటారు. ఇక వాటిలో చీర‌ల‌దే అగ్ర‌స్థానం అని చెప్ప‌వ‌చ్చు. అయితే మీకు తెలుసా..? ఆ మ‌హిళ మాత్రం గ‌త 21 సంవ‌త్స‌రాలుగా ఒక్క చీర కూడా కొన‌లేదు. అవును, షాకింగ్‌గా ఉన్నా మీరు వింటున్న‌ది నిజ‌మే. అయితే ఎందుకు..? ఆమె పేద కుటుంబానికి చెందిన‌దా..? అంటే.. ఉహు కాదు. బాగా సంప‌న్న‌మైన కుటుంబ‌మే. మ‌రి చీర‌ల‌ను ఎందుకు కొన‌డం లేదు..? అంటే.. అవును, అందుకు ఓ కార‌ణం ఉంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే…

ఆమే ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధా మూర్తి. ఈమె బెంగుళూరు ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివారు. మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు. టెల్కో (ప్ర‌స్తుతం టాటా మోటార్స్‌)లో డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఈమె ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్నారు. అయితే సుధా మూర్తి గ‌త 21ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుక్కోలేదట. అందుకు కారణమేంటంటే.. చీరలు కొనడాన్ని ఆమె కాశీలో వదిలేశారట. ‘పవ్రిత స్నానం కోసం నేను 21 ఏళ్ల క్రితం కాశీకి వెళ్లాను. ఎవరైనా కాశీకి వెళ్తే అక్కడ తమకు ఇష్టమైనదాన్ని వదిలేస్తుంటారు. అలాగే నేను షాపింగ్‌.. ముఖ్యంగా చీరలు కొనడాన్ని వదిలేశాను. అప్పటి నుంచి అత్యవసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తున్నాను’ అని సుధామూర్తి మీడియాతో అన్నారు.

కాగా అందుకు తనకు చాలా ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు చెప్పారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. అయితే తనకు, తన భర్తకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టమని సుధామూర్తి చెప్పారు. ఇప్పటికే వారి వద్ద 2లక్షలకు పైగా పుస్తకాలున్నాయ‌ట‌. అంతేగాక, పుస్తకాలు అరువు ఇచ్చేందుకు వీరు ఒప్పుకోరట. ‘ప్రతి ఒక్కరూ మరొకరి నుంచి పుస్తకాలు అప్పు తీసుకుని చదివితే.. ఇక రచయితలు ఎలా బతుకుతారు. రచయితలు పుస్తకాలు అమ్మడం ద్వారా మాత్రమే సంపాదిస్తారు. అదే విషయాన్ని నేను భర్తకు చెప్పాను. అప్పటి నుంచి మేం పుస్తకాలు ఎవరికీ ఇవ్వట్లేదు’ అని సుధామూర్తి చెప్పారు. నిజంగా ఈవిడను చాలా మంది ఇన్‌స్పిరేష‌న్ తీసుకోవాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top