సడన్ గా టాయిలెట్ నుండి వచ్చి అందరిపై అది చల్లాడు…తర్వాత ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు..!

నిజంగా కొంత‌మందికి ఏమ‌వుతుందో తెలియ‌దు కానీ.. అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంటారు. చూసేందుకు మంచిగానే ప్ర‌వ‌ర్తిస్తారు, మంచిగానే మాట్లాడుతారు. కానీ వారికి అంత‌లో ఏమ‌వుతుందో తెలియ‌దు. ఒక్క‌సారిగా పిచ్చిప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తారు. పిచ్చి ప‌నులు చేస్తారు. దీంతో చుట్టూ ఉన్న జ‌నాల‌కు మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వు. ఓ విమానంలో కూడా ప్ర‌యాణికుల‌కు ఓ వ్య‌క్తి నుంచి స‌రిగ్గా ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. ఇంత‌కీ అస‌లు ఏం జరిగిందంటే…

అది చికాగో నుంచి హాంకాంగ్ బ‌య‌లుదేరిన ఓ విమానం. దాని నంబ‌ర్ 895. అది అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన‌ది. అయితే అందులో ప్ర‌యాణికులంద‌రూ ఎంతో హాయిగా జ‌ర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మార్గ‌మధ్య‌లో ఉండ‌గా ఓ ప్ర‌యాణికుడు ఆ విమానంలో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే వెంట‌నే అత‌ను టాయిలెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అనంత‌రం త‌న వ‌ద్ద ఉన్న మ‌లాన్ని ప్ర‌యాణికుల‌పై విస‌ర‌డం మొద‌లు పెట్టాడు. త‌న ద‌గ్గ‌ర ఉన్న ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఆ మ‌లాన్ని రాయ‌సాగాడు. దీంతో ఆ విమానంలో ప్ర‌యాణిస్తున్న వారంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.

ప్ర‌యాణికులంతా షాక్ అయ్యే సరికి విమాన సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు. స‌ద‌రు వ్య‌క్తిని వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం విమానాన్ని అల‌స్కాలో దించేశారు. త‌రువాత ప్ర‌యాణికుల‌ను హోట‌ల్స్‌కు త‌ర‌లించారు. తరువాత‌ విమానాన్ని శుభ్రం చేయించారు. అనంత‌రం య‌థావిధిగా మ‌ళ్లీ విమానం బ‌య‌ల్దేరింది. అయితే ఇలాంటి నీచ‌మైన ప‌ని చేసిన ఆ వ్య‌క్తిపై మాత్రం ఎలాంటి కేసు పెట్ట‌లేద‌ట‌. అతనికి మ‌తి భ్ర‌మించి ఉంటుంద‌ని, అందుకే ఆ వ్య‌క్తిని మానసిక వైద్యశాల‌కు త‌ర‌లించిన‌ట్లు విమానం సిబ్బంది తెలిపారు. కాగా దీనిపై ఎఫ్‌బీఐ ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలిసింది. ఏది ఏమైనా ఆ ప్ర‌యాణికులకు ఎదురైన ఈ ఘ‌ట‌న నిజంగా షాకింగే. ఇలా మాత్రం ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top