బహుశా…పాటకున్న శక్తి అదే కాబోలు. టపటపటప చమట చుక్క తాళాలైపడుతుంటే, పాట పుట్టిందంటాడు సుద్దాల అశోక్ తేజ.ఆ యన ప్రతీ పాట శ్రమైక జీవనాన్ని ప్రతిబింబించేదై… మార్పు కోరేదై, పరివర్తన తెచ్చేదై ఉంటుంది. నా దృష్టిలో సుద్దాల అన్ని పాటలు ఒక ఎత్తైతే…ఈటివి వావ్ షోలో సాయి కుమార్ ముందు పాటిన పాట ఒక ఎత్తు. ఆలో, ఆలో… అంటూ లంబాడీ తల్లి ధైన్యాన్ని కంటికి కట్టిన సుద్దాల అశోక్ తేజ పాట వింటుంటే కన్నీళ్లు చెంపను తడుముతుంటాయ్. వాస్తవ పరిస్థితులకు తనదైన పదాలను వాడుతూ సుద్దాల రచించిన పాట అద్భుతం.
Watch Suddala Special Song:
సుద్దాల పాడిన ఆ పాట విన్నప్పుడల్లా హృదయం వెక్కివెక్కి ఏడుస్తుంది!
Posted by Chantigadu on Tuesday, September 29, 2015