ర్యాంగిగ్ ను తట్టుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్య…కదిలించిన అతని సూసైడ్ నోట్ !

రాగింగ్ భూతానికి  మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  చెన్నై లో చదువుతున్నవెంకట కృష్ణ చైతన్య కుాకట్ పల్లి నిజాంపేట్ రోడ్ లో తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కు ముందు కృష్ణ చైతన్య  తన డైరీలో సూసైడ్ నోట్ రాశాడు.. కృష్ణచైతన్య తన డైరీలో రాసుకున్న చివరిమాటలు చాలా మందిని కదిలించాయ్ . తమిళనాడులో చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణచైతన్యను, అదే కాలేజ్ లో సీనియర్ స్టూడెంట్ అయిన శేఖర్ తనపై చేస్తున్న ర్యాగింగ్ వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తన డైరీలో రాసుకున్నాడు.

సూసైడ్ లో కృష్ణచైతన్య రాసిన డైరీలో మనుసును కదిలించిన అంశాలు..

“చెన్నై సత్యభామ కాలేజ్ లో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణచైతన్యను, విజయవాడకు చెందిన శేఖర్ అనే సీనియర్ స్టూడెంట్ తరచూ ఇష్టం  వచ్చినట్లు  కొట్టి, హింసించేవాడట. ఒకసారి తను కారు అద్దెకు తీసుకొని, తన అవసరాలకు ఉపయోగం చేస్తుండగా, శేఖర్ ఆ కారును లాక్కొవడమే కాకుండా,దానికి కావల్సిన పెట్రోలు ఖర్చులు, ఇంకా అతడి మొబైల్ బిల్ కృష్ణచైతన్య వద్దే లాక్కునే వాడట. ఇంటిదగ్గర నుండి పేరెంట్స్ పంపించే డబ్బులు తన అవసరాలకు సరిపోయేవి. శేఖర్ పెట్టే టార్చర్ కు పార్ట్ టైంగా ఉద్యోగం చేస్తూ రూ. 15,000 సంపాదించుకునేవాడినని ఆ సూసైడ్ నాట్ లో రాసుంది.

తన బంధువుల అమ్మాయి ఐశ్వర్య, కృష్ణ చైతన్య తరచూ మాట్లాడేవాడట. ఆ అమ్మాయి ఎవరూ అని శేఖర్ ఆరా తీయగా, మా కజిన్ అని చెప్పినా.. ఆ అమ్మాయికి, చైతన్యకు లేనిపోని సంబంధాలు పెట్టి, అసహ్యంగా మాట్లాడి హింసించేవాడు శేఖర్. అందరిముందూ కొట్టడమే కాకుండా, ఒక మోసగాడిలా చిత్రించేవాడు. నరకం అంటే ఏంటో చూపించేవాడు. ఎవరికైనా చెబితే నరికేస్తానని, ఇంట్లో మీకు చెప్పినా ఇంకా ఎక్కువగా ఇలా చేస్తాడని మీకు చెప్పలేదు నాన్న. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ శేఖర్ చేస్తున్న పనులవల్ల నేను మీకు దూరమవుతున్నాను. ఇక ఆ నరకం భరించడం నావల్ల కాదు”. అని ఎంతో బాధపడుతూ తన డైరీలో రాసుకున్నాడు.
ఒకవైపు న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ర్యాగింగ్ చేస్తే కటినశిక్షలు విధిస్తామని,అలాంటి చర్యలకు పాల్పడవద్దని చెబుతున్నా.. ర్యాగింగ్ మాత్రం అంతం కావట్లేదు. పేరెంట్స్ కు చెప్పుకోలేక,ఫ్రెండ్స్ కు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతూ ఇలా నిండు ప్రాణాలను బలితీసుకొని, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రులను ఒంటరి వాళ్ళుగా చేస్తున్నారు.
1
2.2
2
3

Comments

comments

Share this post

scroll to top