గెలుపు వెలుగులు పంచుతున్న కార్తీక్

ప్రతి ఒక్కరికి సక్సెస్ సాధించాలన్న కోరిక ఉండే వుంటుంది. అయితే కష్టపడకుండా ఏదీ మన దరికి రాదు. దేనిని కోరుకుంటామో దానిని పొందాలంటే సరైన దిశా నిర్దేశం చేసే వాళ్ళు కావాలి. జీవితంలో కష్టాలు దాటుకుని..కన్నీళ్లను దిగమింగుకుని విజేతలుగా నిలిచే వాళ్ళతో సహవాసం చేయాలి . అప్పుడే లైఫ్ అంటే ఏమిటో అందులో గెలుపులోని మజా ఏమిటో అర్థమవుతుంది.

ఒక్క రోజులోనో . ఒకరు చెబితేనో సక్సెస్ రాదు. మనకు మనమే సాధించాలి. అందుకు విరామం ఎరుగక శ్రమించాలి. ఎవ్వరు ఏమన్నా సరే మన గమ్యం చేరేందుకు అడుగులు వెయ్యాలి. అందులో రాళ్లు రావొచ్చు ..వజ్రాలు సైతం దొరకొచ్చు. అదంతా మనం చేసే ప్రయత్నం మీద ఆధారపడి వుంటుంది.

భూమి మీద నిలబడి ..ఆకాశం వైపు ఒక్కసారి నిటారుగా చూడండి. అంతులేని వెలుగు ..ఎక్కడాలేనంత ప్రశాంతత అగుపిస్తుంది. ఇదంతా మానవ జీవితానికి ప్రకృతి ప్రసాదించిన వరం. డబ్బులే లోకమనుకుని చదువుకున్న తక్షణమే ఉద్యోగం రావాలని కలలు కనే వాళ్లకు ఈ మారుతున్న కాలం అస్సలు అర్థం కాదు. ఇది ముమ్మాటికీ పోటీ ప్రపంచం. ఇందులో ఎవరు అందరిని దాటుకుని ముందు నిలుస్తారో వాళ్ళే అంతిమ విజేతలుగా నిలుస్తారు.

kvn karthik

ఇది పొందాలంటే దమ్ముండాలి. అంతకంటే పట్టుదల ఉండాలి . గుండెల్లో కసి రేగాలి . నంబర్ వన్ స్థానం సాధించాలంటే అందుకు సరైన దారిని చూపించే మార్గదర్శకుడు కావాలి . అప్పుడే గమ్యం ఏమిటో .. ఏ వైపు ఎలా వెళితే మనకు గెలుస్తామో తెలుస్తుంది . అలాంటి మెంటార్ పాత్రను హైదరాబాద్ కు చెందిన కేవీఎన్ కార్తిక్ .

సాఫ్ట్ స్కిల్స్ ..లైఫ్ మేనేజ్మెంట్ ..కంమ్యూనికేషన్ స్కిల్స్ ..ఇలా ప్రతి దానిలో తర్ఫీదు ఇస్తారు ఇంపాక్ట్ లో .. ఇప్పుడు మనోడు అందులో ఫుల్ టైం ట్రైనర్ . అక్కడ లైఫ్ లో గోల్స్ పెట్టుకుని సాధించిన వాళ్ళుంటారు . జీవితాన్ని కాచి వడబోసి అడుగులు ఎలా వేయాలో మార్గ నిర్దేశనం చేసే మేధావులు ఉంటారు. ఎలాంటి భేషజాలు లేకుండా గోల్ సెట్టింగ్ తో ముందడుగు వేసే ధైర్యాన్ని వాళ్ళు ఇస్తారు . అలాంటి వాళ్లల్లో కార్తీక్ కూడా ఒకడు .

అంతా ఐటి ఎంచుకుంటే .. అసలు ఉద్యోగం సాధించాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి . వాటిని ఎక్కాలంటే ఏమేం చేయాలో ..ఏమేం చేయకూడదో మనోడు తర్ఫీదు ఇస్తాడు . దాని కోసం ఓ ట్రైనింగ్ మోడ్యూల్ తయారు చేస్తాడు . ఓ వారం రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది . హాజరైన వాళ్ళు శ్రద్దగా వింటారు . మొదటి రోజున భయంగా హాజరయ్యే విద్యార్థులు ..ఉద్యోగార్థులు ..నిరుద్యోగులు ..ఏడు రోజులయ్యాక ఈ ప్రపంచాన్ని ..అది పెట్టే ఏ పరీక్షకైనా సిద్ధమంటూ సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటారు . ఇదంతా కార్తిక్ మహిమ ..కాదు అతడిలోని టాలెంట్.

సాధిచాలన్న సంకల్పమే లేకపోతే సక్సెస్ ఎలా వస్తుంది . అందుకే బాగా కష్టపడాలి. ఓటమి ఎదురయినా లేదా గెలుపు అందినా సరే ముందుకే కదలాలి . మీ ముందు ఉన్నది ఒకటే లైఫ్ . ఇది పోతే మళ్ళీ రాదు . ఒక వేళ వచ్చినా ఇలాంటి కాలం మళ్ళీ మన గుప్పిట్లో ఉండదు . ఈ క్షణం ముఖ్యం . ఇది దాటితే మనకు గోల్ లేనట్టే అంటాడు కార్తిక్ .

కార్పొరేట్ కంపెనీలే కాదు ఇతర ఏ కంపెనీలోలైన సరే జాబ్ పొందటానికి కావాల్సిన వన్నీ మనకు దగ్గరుండి నేర్పిస్తాడు . అందుకే అతడంటే స్టూడెంట్స్ అంత అభిమానం . కార్తీ టాలెంట్ తో దేశంలో చెన్నై , మధ్యప్రదేశ్ .. ఢిల్లీ ..బెంగాల్ ..గుజరాత్ ..ఇలా ఎన్నో ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇచ్చాడు . ఇంకా ఇస్తూనే ఉన్నాడు . ఒకప్పుడు ఏదో ఒకరోజు నా కోసం రాక్ పోతుందా అని ఎదురు చూసిన ఆ కుర్రాడు ..ఇప్పుడు ఎందరికో లైఫ్ లో సెటిల్ ఆయేలా చేసే స్థాయికి చేరుకున్నాడు .

ఇది కల కాదు .ఇది నిజం . మీరూ కలలు కనండి . గోల్ పెట్టుకోండి . దాని కోసం పాటు పడండి. వేరొకరిని చూసి అనుసరించకండి . మీదైన దారిని ఎంచుకోండి . మీ కోసం కష్టపడండి . సక్సెస్ దానంతట అదే వస్తుంది . అప్పుడు ఛీత్కరించిన సమాజమే మిమ్మల్ని గుర్తిస్తుంది. అప్పుడు సమాజం కోసం ఏదైనా కొంత ఇవ్వండి అంటాడు వినయంగా . అతడి ఆశయం చిన్నదే కావొచ్చు ..కానీ అతడు ప్రయాణం చేస్తున్న గమ్యం మాత్రం గొప్పది .

Comments

comments

Share this post

scroll to top