“ప్రేమలో పడ్డాను..పాస్ చేయండి” అని ఒకరు రాస్తే..మరో ఇంటర్ స్టూడెంట్ ఏమని రాసారో తెలుసా.?

విద్యార్థులెవ‌రికైనా ప‌రీక్షలు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయంటే భ‌యం. వాటిల్లో పాస‌వుతామా ? ఫెయిలైతే ఏం జ‌రుగుతుంది ? ఇంట్లో తిడ‌తారేమో ? అని విద్యార్థులు నానా హైరానా ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు అయితే మ‌రీ ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతారు. ఎందుకంటే వారు స‌రిగ్గా చ‌ద‌వ‌రు. అందుకని ఎగ్జామ్స్ వ‌స్తున్నాయంటే చాలు.. విప‌రీత‌మైన భ‌యానికి లోన‌వుతారు. అయితే ఆ రాష్ట్రంలోనూ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాసిన కొంద‌రు విద్యార్థులు ఇలాగే ఎగ్జామ్స్‌కు చ‌ద‌వ‌కుండా భ‌య‌ప‌డ్డారు. కానీ వారు అంత‌టితో ఆగ‌లేదు.. ఎగ్జామ్స్‌లో రాయాల్సిన ఆన్స‌ర్ షీట్ల‌లో స‌మాధానాల‌కు బ‌దులుగా వింత రాత‌లు, గీత‌లు గీశారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ మ‌ధ్యే ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ముగిశాయి క‌దా. అయితే ఆ ప‌రీక్ష‌ల‌కు గాను స్పాట్ వాల్యుయేష‌న్ కూడా ప్రారంభ‌మైంది. దీంతో విద్యార్థులు రాసిన ఆన్స‌ర్ షీట్ల‌ను దిద్దుతున్న లెక్చ‌ర‌ర్ల‌కు వింత అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ఓ విద్యార్థి తన కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా రాశాడు. ఐ లవ్ మై పూజ అని ఆకర్షణీయంగా పెద్ద అక్షరాలతో రాశాడు. ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఈ ప్రేమ బత‌కనీయదు.. చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు చదవలేకపోయాను. మీరే నన్ను పాస్ చేయండి అంటూ ఆ విద్యార్థి వేడుకున్నాడు. ఐ లవ్ మై పూజ పక్కనే హార్ట్ సింబల్ గీశాడు. అలా ఓ విద్యార్థి త‌న‌ను ప‌రీక్ష‌లో పాస్ చేయాల‌ని ఆ పేప‌ర్ దిద్దే లెక్చ‌ర‌ర్‌కు ఆన్స‌ర్ షీట్‌లో అలా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.

ఇక మరో విద్యార్థి అయితే… నాకు అమ్మ లేదు. నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నాన్న నన్ను చంపేస్తారు అని రాశాడు. క‌నుక త‌న‌ను పాస్ చేయాల‌ని కోరాడు. అలాగే ఇంకో విద్యార్థి టీచర్లను హెచ్చరించాడు. మీరు నన్ను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు. కాగా ఈ ఘటనలపై ముజఫర్‌నగర్ జిల్లా విద్యాధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థులైతే తమను పాస్ చేయాలని కోరుతూ పరీక్ష పేపర్ల మధ్య కరెన్సీ నోట్లు పెడుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా విద్యార్థులు ఇలా చేస్తుండ‌డం భ‌లే వింత‌గా ఉంది క‌దా. అన్ని తిప్పలు ప‌డే బ‌దులు శుభ్రంగా చ‌దివి ఉంటే చ‌క్క‌గా ఎగ్జామ్ రాసేవారు కాదు. ఏంటో.. ఈ విద్యార్థులు.. మరీ ఇలా వింత‌గా ప్ర‌వ‌ర్తించారు.

Comments

comments

Share this post

scroll to top