స్కూల్ లాస్ట్ డే రోజున‌…. ఫొటోల‌కు న‌గ్నంగా పోజులిచ్చిన విద్యార్థులు, టీచ‌ర్లు..!

స్కూల్ లేదా కాలేజ్… ఏదైనా విద్యా సంవ‌త్స‌రం చివ‌రి రోజున విద్యార్థులంద‌రూ ఏం చేస్తారు..? ఒక‌రి సంత‌కాలు ఒక‌రు తీసుకుంటూ, క్లాసుల్లో తాము చేసిన అల్ల‌రి ప‌నులను గుర్తు చేసుకుంటూ, కేక్ క‌ట్ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ వేడుక‌లు జ‌రుపుకుంటారు. ఇక ఆ త‌రువాత మ‌ళ్లీ క‌లుస్తామో లేదో, క‌లిస్తే ఎప్పుడు క‌లుస్తామో… అని బాధ ప‌డుతూ తోటి విద్యార్థులు, స్నేహితులు, టీచ‌ర్ల నుంచి వీడ్కోలు తీసుకుంటారు. ఒక‌రికొక‌రు ఆలింగ‌నాలు చేసుకుంటారు. ఇది మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచంలోని ఏ స్కూల్ లేదా కాలేజీలో అయినా ఇలాగే జరుగుతుంది. అయితే ఫ్రాన్స్ లోని ఆ స్కూల్‌లో అలా కాదు, కొంచెం విభిన్నంగా స్కూల్ లాస్ట్ డే ఫెస్టివ‌ల్ జ‌రిగింది. స్కూల్‌లో ఉన్న స్టూడెంట్స్‌తోపాటు టీచ‌ర్స్ కూడా న‌గ్నంగా నిల‌బ‌డి ఫొటోల‌కు ఫోజులిచ్చారు. షాకింగ్ ఉన్నా… ఇది నిజ‌మే..!

naked-school-last-day

అది ఫ్రాన్స్‌లోని అవిగ్న‌న్‌లో ఉన్న లైసీ ఫ్రెడ‌రిక్ మిస్ట్ర‌ల్ హై స్కూల్‌. అందులో సైన్స్ అండ్ టెక్నాల‌జీ క్లాస్ (ఎస్‌టీడీ2ఏ) చ‌దువుతున్న విద్యార్థులకు ఈ ఏడాదితో విద్యాభ్యాసం ముగిసింది. దీంతో అంద‌రి లాగే వారు స్కూల్ లాస్ట్ డే రోజున సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకున్నారు. అయితే అంద‌రిలా చేస్తే విశేషం ఏముంటుంది అనుకున్నారో ఏమో, త‌మ స్కూల్ లాస్ట్ డే రోజును విభిన్నంగా జ‌రుపుకోవాల‌ని భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ విద్యార్థులు న‌గ్నంగా మారిపోయి ఫొటోల‌కు ఫోజులిచ్చారు. త‌మ జ‌ననావ‌య‌వాల‌కు బ్లాక్ కార్డ్ పేప‌ర్ల‌ను అడ్డంగా పెట్టుకుని వారు ఫోటోలు దిగారు. అయితే ఇందులో ఇంకో షాకింగ్ విష‌యం ఏమిటంటే… విద్యార్థుల‌కు టీచ‌ర్లు తోడ‌వ‌డం. ఉపాధ్యాయులు కూడా న‌గ్నంగా త‌యారై విద్యార్థుల‌తో క‌లిసి ఫొటోలు దిగారు.

అయితే ఆ విద్యార్థులు అంత‌టితో ఆగలేదు. ఆ ఫోటోల‌ను ఏకంగా త‌మ త‌మ సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే వైర‌ల్ అయ్యాయి. కొన్ని ల‌క్ష‌ల మంది వాటిని వీక్షించారు. ఈ క్ర‌మంలో చాలా మంది ఆ ఫోటోల‌ను షేర్ చేశారు కూడా. అయితే దీన్ని చూసిన చాలా మంది నెటిజ‌న్లు ఏమంటున్నారంటే… విద్యార్థులు దిగితే దిగారు, కానీ టీచ‌ర్ల‌కు ఏ మాయ రోగం వ‌చ్చింది, వారెందుకు అలా మారారు..? అంటూ కొంద‌రు… గుడ్‌… విద్యార్థుల‌ స్వేచ్ఛా భావాల‌కు ఈ ఫొటోలు నిద‌ర్శ‌నం అంటూ ఇంకొందరు… త‌మ కామెంట్ల‌ను వినిపిస్తున్నారు. ఏది ఏమైనా… ఇలాంటి వింత పోక‌డ‌లు మాత్రం మ‌న దాకా రావొద్ద‌నే ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top