పరీక్ష ఫీజు కట్టలేను…అందుకే చనిపోతున్నాను అంటూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.

అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం చూడకండి. నన్ను సార్ స్కూల్లో ఫీజు అడిగాడు. మొన్ననే అయిదు వేలు కట్టాము. ఇప్పుడు  మనింట్లో డబ్బులేవ్.  అన్నీ ఆలోచించే  నేను  చనిపోతున్నాను. అందరికీ బై, బై. అంటూ వీడియోలో చిత్రీకరించి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా ధర్మారంలో జరిగింది.

కరీంనగర్ జిల్లా  అబ్బాపురానికి చెందిన  ఈదుల శ్రీనివాస్‌రెడ్డి అంజలి దంపతులకు ముగ్గురు కొడుకుల్లో  చిన్నకొడుకు సంతోష్‌రెడ్డి. అతను ఓ ప్రయివేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సంవత్సరానికి ఫీజు 12 వేలు. ఇటీవలే మొదటి విడతగా ఐదువేల రూపాయలు చెల్లించారు. రెండ్రోజుల క్రితం పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందిగా కరస్పాండెంట్ విద్యార్థులకు సూచించారు.

ఫీజు చెల్లించేందుకు డబ్బు ఇవ్వాలని సంతోష్‌రెడ్డి తన తండ్రిని  అడిగాడు. ఈమధ్యే ఐదువేలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ..పంటలు పండలేదని, ఇంట్లో డబ్బులు లేవని నాలుగైదు రోజుల్లో ఇద్దామని తండ్రి సర్దిచెప్పగా సంతోష్‌రెడ్డి బడికి వెళ్లాడు. అదేరోజు సంతోష్‌రెడ్డితోపాటు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులనందరిని పాఠశాలలో నిలబెట్టారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top