వాచ్ తయారు చేస్తే బాంబ్ అని తనను అవమానించారని, స్కూల్ పై 99 కోట్లకు పరువునష్టం దావా వేసిన విద్యార్థి.!

దేశం గర్వించే గొప్ప శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. స్కూల్ లో నెంబర్ వన్ కావాలని బాగా చదవుతూ అందరిచేత మన్ననలు పొందాడు. మంచి విద్యార్ధి అని అభినందించిన వారే కటకటాలకు తరలించారు. స్టూడెంట్ గా ఉండాల్సిన వాడు నిందితుడు ముద్రను వేయించుకున్నాడు. ఇప్పుడు అవమాన భారంతో రూ. 99 కోట్ల నష్టపరిహారం అడుగుతున్నాడు.  అమెరికాలో టెక్సాస్ లోని ఇర్వింగ్ సిటీలో ఉన్న ‘ మెక్ ఆర్థర్ హై స్కూల్’ లో 14 ఏళ్ళ అహ్మద్ మహ్మద్ చదువుకుంటున్నాడు. తమ స్కూల్ లో జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్  కార్యక్రమానికి హోం మేడ్ గడియారాన్ని రూపొందించి స్కూల్ కు తీసుకెళ్ళాడు. అయితే అహ్మద్ తీసుకువచ్చిన హొమ్ మేడ్ గడియారాన్ని బాంబుగా భావించిన స్కూల్ యాజమాన్యం పోలీసులను పిలిపించి ఆహ్మద్ ను అరెస్ట్ చేయించింది.

boy

అయితే అహ్మద్ మహ్మద్ రెడీ చేసింది బాంబుకాదని, హోం మేడ్ వాచ్ అని నిర్ధారించుకున్న పోలీసులు, స్కూల్ యాజమాన్యం అహ్మద్ ని నిర్దోదిగా తేల్చింది. అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా శ్వేత సౌదవానికి అహ్మద్ ను పిలిపించుకొని తను చేసిన హొమ్ మేడ్ వాచ్ చూసి అభినందించాడు. అయితే ఎన్ని అభినందనలు అందినా తను చేసిన కృషిని గుర్తించకుండా,నిందితుడుగా భావించడంతో తీవ్ర అవమానానికి గురయ్యాడు. తన జాతీయత, మతం దృష్టిలో వుంచుకొని తనను అవమానించారని, తన తరపు లాయర్ తో స్కూల్ యాజమాన్యం, ఇర్వింగ్ సిటీ అధికారులను నష్టపరిహారం చెల్లించవలసిందిగా నోటీసులు పంపాడు.15 మిలియన్ డాలర్లు (రు. 99కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని అహ్మద్ మహ్మద్ డిమాండ్ చేస్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top