“మంచు లక్ష్మి” కి ట్విట్టర్ లో ఓ అమ్మాయి సూపర్ కౌంటర్..! అసలేమైంది అంటే..!

అవును మరి… గురువింద గింజకు తన కింద  ఉన్న నలుపు తెలియదు. కానీ ఎదుటి వారి తప్పులను మాత్రం ఎంచుతుంది. ఎవరెవరు ఏమేం తప్పులు చేస్తున్నారో చెబుతుంది. కానీ తాను చేసే తప్పుల గురించి మాత్రం అస్సలు ఆలోచించదు. అవును. సినీ నటి మంచు లక్ష్మికి కూడా సరిగ్గా ఇదే వర్తిస్తుంది కాబోలు. ఎందుకంటే విషయం అలాంటిది మరి. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు మామూలే. గంటల తరబడి అందులో వెయిట్‌ చెయ్యాల్సి ఉంటుంది. దీనికి తోడు రోడ్ల సంగతి సరే సరి. అయితే దీన్ని  సామాన్య ప్రజలుగా మనం ఎప్పటినుంచో అనుభవిస్తున్నాం. కానీ మంచు లక్ష్మికి ఈ మధ్యే కనిపించినట్టుంది. దీంతో ట్రాఫిక్‌ గురించి తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

తాను గంటన్నర సమయం నుంచి ట్రాఫిక్‌లో హైదరాబాద్‌లో హైటెక్స్‌ వద్ద చిక్కుకున్నానని, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు ప్రోటోకాల్‌ లేకుండా సామాన్య పౌరుల్లా వెళ్తే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలు ఏమిటో తెలుస్తాయని మంచు లక్ష్మి ట్వీట్‌ చేసింది. అవును, ఇది నిజమే కదా. అందులో తప్పేముంది, అని భావిస్తున్నారు కదూ. అయితే ఇది కరెక్టే అయినా… ఇక్కడే ఓ చిక్కు ఉంది. నిజానికి సినిమా సెలబ్రిటీలు రోడ్లపై  సాధారణ పౌరులే. కానీ.. తిరుమల వంటి దేవస్థానాల విషయానికి వస్తే వారు వీఐపీలు అయిపోతారు కదా. సరిగ్గా ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ యువతి మంచు లక్ష్మి ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.

ట్విట్టర్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ రద్దీపై మంచు లక్ష్మి పెట్టిన ట్వీట్‌కు రస్నా అనే యువతి రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏం అన్నదో తెలుసా.. నిజమే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విషయానికి వస్తే మీరు కూడా సామాన్య పౌరులే. కానీ తిరుమల వెళ్లినప్పుడు మాత్రం మీరు వీఐపీలు అయిపోతారు. మీకు సులువుగా వీలైనంత సేపు వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది. కానీ సామాన్య పౌరులకు మాత్రం అలా వీలు కాదు. అలాంటప్పుడు మీరు వీఐపీలు కాకుండా పోతారా.. అని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేసింది. దీంతో రస్నా అనే యువతిని ఇప్పుడు నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. మంచు లక్ష్మికి భలే కౌంటర్‌ వేశావంటూ ఆమెను అభినందిస్తున్నారు. అవును నిజమే. మంచు లక్ష్మి లాంటి వారు కూడా సెలబ్రిటీలే కదా. మరలాంటప్పుడు ఆమె ట్రాఫిక్‌ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది కదా. తిరుమలలో వేరే.   ఈమె లాంటి వారు సెలబ్రిటీలు అయిపోతారు. మరి అక్కడ  ఈమె ఎందుకు మాట్లాడదు. అంటే.. ఒక్కటే.. అక్కడ వారు సెలబ్రిటీలు. కానీ రహదారులపై కాదు కదా. మరి ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఆమె ట్వీట్‌ పెట్టాలి. అంతేకానీ తిరుమలలో వారు వాడుకునే వీఐపీ ట్రీట్‌మెంట్‌ను మరిచి సామాన్య పౌరుల్లా ట్రాఫిక్‌ గురించి ట్వీట్‌ చేస్తే ఎలా..! కరెక్ట్‌ అవునా, కాదా మీరే చెప్పాలి..!

Comments

comments

Share this post

scroll to top