తికమక పెట్టే “నాగ చైతన్య” కొత్త సినిమా టైటిల్..! “సవ్య సాచి” వెనకున్న అర్ధం, అసలు కథ తెలుసా..?

త్రివిక్రమ్ గారు చెప్పిన “అర్ధమయ్యేలా మాత్రమే కాదు..అర్ధం చేసుకోవాలి అనిపించేలా కూడా రాయొచ్చు” అనే మాటను టైటిల్ పెట్టడంలో ఫాలో అయ్యారు చందు మొండేటి. ప్రేమమ్ సక్సెస్ తో మరోసారి “నాగ చైతన్య” తో మైత్రి మూవీ బన్నెర్స్ లో ఓ సరికొత్త సినిమా తీస్తున్నారు చందు మొండేటి.ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇందాకే విడుదల చేసారు. మూవీ టైటిల్ తికమకగా ఉంది. “సవ్య సాచి” అని టైటిల్ చూడగానే చాలామంది ఆ పేరుకి అర్ధం తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేసి ఉంటారు. అయితే ఈ పదం కి అర్ధం తెలియాలి అంటే శివాజీ సినిమా గుర్తుతెచ్చుకోవాలి. ఆ సినిమాలో మన సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకేసారి రెండు చేతులతో సంతకం పెడతాడు గుర్తుందా? అయితే ఇప్పుడు ఆ సీన్ కి ఈ టైటిల్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? వివరాలు మీరే చూడండి!

శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలనుసమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం (Ambidextirity) అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు రెండు చేతుల‌ను స‌మానంగా ఉప‌యోగించ‌గ‌ల‌గ‌డం.! ఇలాంటి సామ‌ర్థ్యం 100 మందిలో ఒక్క‌రికి మాత్ర‌మే ఉంటుంది. అర్జునుడిని స‌వ్య‌సాచి అంటారు. అర్జునుడు కుడిచేత్తో ఎంత నేర్పుతో బాణాలు వేయ‌గ‌ల‌డో…అంతే నేర్పుతో ఎడ‌మ‌చేతితో కూడా బాణాల‌ను సంధించ‌గ‌ల‌డు.!

కొంత మందికి జ‌న్మ‌త ఈ ల‌క్ష‌ణం ఉంటే ఇంకొంత మందికి, ఈదడం, వాయిద్యాలను మోగించడం, కీ బోర్డ్ సంగీతం, బేస్ బాల్, హాకీఆట, శస్త్ర చికిత్స, బాక్సింగ్, యుద్ధ విద్యలు, బాస్కెట్ బాల్ ఆట‌ల‌ను ఎక్కువ‌గా ఆడ‌డం ద్వారా ఈ నిపుణ‌త సాధించ‌వ‌చ్చు.!

ఈ ప‌దం ఎక్క‌డి నుండి పుట్టింది? ఎలా వ‌చ్చింది??

లటిన్ లోని యాంబీ అనే ప‌దం నుండి స‌వ్య‌సాచిత్వం అనే ప‌దం రూపాంత‌రం చెందుకుంటూ వ‌చ్చింది. యాంబీ అంటే ఇరువైపులా అనీ, డెక్సటర్ అంటే సరైన లేదా అనుకూలమైన అని అర్థం.

పేట్ రోస్….
రెండు చేతుల‌తో స‌మాన సామ‌ర్థ్యం చూపిన వ్య‌క్తి. ఇత‌ను బేస్ బాల్ క్రీడాకారుడు…రెండు చేతుల‌తో స‌మాన సామ‌ర్థ్యం ఉండ‌డం వల్ల బేస్ బాల్ చ‌రిత్ర‌లో ఎక్కువ హిట్లు కొట్టిన క్రీడాకారుడిగా రికార్డ్స్ లోకి ఎక్కాడు.!

Comments

comments

Share this post

scroll to top