మన్కడింగ్ అవుట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా.? మన్కడింగ్ ఎవరంటే..!!

రవిచంద్రన్ అశ్విన్… ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఒక తాటి పైకి తెచ్చి కొట్టుకునేలా చేసాడు, కొంతమంది అతనికి అండగా నిలిస్తే, మరికొంతమంది అతను చేసిన దాన్ని వ్యతిరేకించారు. క్రికెటర్ లు కూడా కొంత మంది అతన్ని దూషిస్తే, మరి కొంత మంది సమర్ధించారు. బాల్ వెయ్యకముందే బట్లర్ క్రీజ్ దాటడం తో అశ్విన్ అవుట్ చేసాడు, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చాలా మంది అశ్విన్ ని దూషించారు.

మన్కడింగ్ అంటే.. :

అశ్విన్ అలా అవుట్ చేసిన విధానాన్ని మన్కడింగ్ అవుట్ అని అంటారు, అసలు మన్కడ్‌ మన ఇండియన్ బౌలర్ అని చాలా మందికి తెలియకపోవచ్చు, ముఖ్యంగా నేటి తరం యువతకి ఆయనెవరో తెలియక పోవచ్చు, కానీ క్రికెట్ ఆట మొదలైన తొలినాళ్లలో భారత్ తరపున క్రికెట్ ఆడిన అత్యంత గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు, ఒక్క మాట లో చెప్పాలంటే లెజెండ్, మరి ఆయన పేరు ఈ అవుట్ కి ఎందుకు పెట్టారని చాలా మంది అనుకోవచ్చు, అందుకు ఒక కారణం ఉంది.

మొదలు ఆయనతోనే.. :

ఇలా అవుట్ చెయ్యడం కొత్తేమి కాదు, క్రికెట్ తొలి నాళ్ళలోనే ఇలా అవుట్ చేసారు, 1947–1948 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్‌ మన్కడ్‌ ఆస్ట్రేలియన్ బ్యాట్సమెన్ ని ఇలా చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ నిబంధనగా క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) నియమావళిలో చేర్చింది. ఆ పర్యటనలో వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని హెచ్చరించినా వినిపించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ పర్యటనలో మరోసారి కూడా మన్కడ్, బ్రౌన్‌ను ఔట్ చేశాడు. అప్పటినుంచి ఈ రనౌట్‌ను మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు. కాని ఇది క్రీడాస్ఫూర్తి కి విరుద్ధం అని చాలా మంది పేర్కొన్నారు, నాటి నుండి నేటి వరకు క్రీడాస్ఫూర్తి మన్కడింగ్ అవుట్ విరుద్ధం అని పేర్కొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.

ఆయన పేరు తీసేయండి – గవాస్కర్ .. :

లిటిల్ మాస్టర్ గవాస్కర్ ఈ ఇష్యూ పైన ఫుల్ ఫైర్ అయ్యారు, అశ్విన్ ఇలా అవుట్ చెయ్యడం క్రీడాస్ఫూర్తి విరుద్ధమే, కానీ ఈ అవుట్ కి భారత దిగ్గజ ప్లేయర్ మన్కడ్‌ పేరే ఎందుకు పెట్టారని గవాస్కర్ ఫైర్ అయ్యారు, అంతగా ఉంటే అవుట్ అయిన బిల్ బ్రౌన్ పేరు పెట్టొచ్చు కదా ఈ అవుట్ కి అని సునీల్ గవాస్కర్ మండిపడ్డారు, ఈ మన్కడింగ్ అవుట్ ని తీసేయాలని చాలా మంది కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఈ మన్కడింగ్ పైన ఇంకెంత రచ్చ జరుగుతుందో వేచి చూడాల్సిందే.

 

Comments

comments

Share this post

scroll to top