ఏకలవ్య… ది గ్రేట్ శిష్య.! ( పురాణ శిశువులు-4)

ద్రోణాచార్యుడి వద్ద అర్జునుడు మరియు అతని సోదరులు విలువిద్యలో శిక్షణ పొండుతుండేవారు. శూద్ర తెగకు చెందిన ఏకలవ్యుడు ఆ శిక్షణ తీసుకోవాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని తన తల్లితో చెప్పాడు. అది జరిగేపని కాదని, మనకు అక్కడ శిక్షణ ఇవ్వడం వీలుకాదని తన తల్లి చెప్పినా వినకుండా, ద్రోణాచార్యుడి ఆశ్రమం వద్దకు వెళ్లి, నేను కూడా శిక్షణ తీసుకుంటానని చెబుతాడు దానికి  ద్రోణుడు తిరస్కరిస్తాడు. అయితే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమను తయారుచేసుకొని, తన గురువుగా భావించుకొని విలువిద్యను సాధన చేస్తాడు. అకుంఠిత దీక్షతో కొద్ది రోజులలోనే గొప్ప విలువిద్యకారిడిగా తననుతాను రూపుదిద్దుకుంటాడు.
hqdefault
ఒకరోజు తన శిష్యులతో కలిసి అరణ్యంలో ద్రోణాచార్యుడు నడుచుకుంటూ వెళ్తుండగా అలసటగా ఉండడంతో ఒక చెట్టు కింద కూర్చుంటారు. అదే సమయంలో పక్కన ఏకలవ్యుడు  ధనుర్భాస్యం చేస్తుండగా,ఒక్క కుక్క గట్టిగా పదే పదే అలా అరవడం మొదలుపెట్టింది.ఆ శబ్దం  ఏకలవ్యుడుకి చిరాకు కలిగించింది. వెంటనే బాణం ఎక్కుపెట్టి పొదలనుండే బాణాలు వదిలి, కుక్క నోరు మూసివేశాడు. రక్తం చుక్కైనా కిందపడకుండా కుక్క నోరును మూయించిన, ఆ ప్రతిభావంతుడైన విలువిద్యకారుడు ఈ అడవిలో ఉన్నారా?అని ద్రోణాచార్యుడు,అర్జునుడు ఆశ్చర్యపోయారు. ఇంతలో ఏకలవ్యుడు అక్కడికి వచ్చి తనను పరిచయం చేసుకొని గురువు పాదాలకు నమస్కరించాడు. తన ప్రతిమను పెట్టుకొని విలువిద్యలో ఆరితేరిన ఏకలవ్యుడుని చూసి మెచ్చుకున్నాడు ద్రోణుడు. అక్కడి నుండి వారంతా వెళ్ళిపోయారు.
Introduction-to-Mahabharata6
తనకంటే విలువిద్యలో గొప్పవాడు అవుతాడని అర్జునుడు చింతనతో,ఏకలవ్యుడి గురించి మరియు అందరికన్నా నన్నే గొప్ప విలువిద్య ఎవరూలేరని చెప్పారుగా, నన్నే మేటి విలువిద్యకారుడిగా చేస్తానని మాటిచ్చారని అర్జునుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు. ఆ తర్వాత అర్జునుడు, తన సహగణాన్ని తీసుకొని ఏకలవ్యుడు ఉన్న చోటుకు బయలుదేరతాడు ద్రోణాచార్యుడు.తన గురువు మట్టిబొమ్మ ముందు సాధన చేస్తూ ఉన్న ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడిని చూసి ఆయన కాళ్ళపై మోకరిల్లుతాడు. తనకు గురుదక్షిణ ఏమిటని ద్రోణుడు అడుగుతాడు. మీరు ఏదడిగినా నేను కాదననని ఏకలవ్యుడు చెబుతాడు. ద్రోణాచార్యుడు కుడిచేయి బొటనవేలు గురుదక్షిణగా ఏకలవ్యుడిని అడుగుతాడు. మారు మాట్లాడకుండా తన గురువు మాటను గౌరవిస్తూ తన బొటనవేలు ఇచ్చేస్తాడు ఏకలవ్యుడు. ఇది చూసిన అర్జునుడు అతడి సోదరులు ఒక్కసారిగా విస్తుపోయారు.కుడిచేయి బొటనవేలు ఇవ్వడం వలన ఏకలవ్యుడు బాణం వేయలేడు, గొప్ప విలువిద్యకారుడు కాలేడు. అప్పుడు అర్జునుడే గొప్ప విలువిద్యకారుడు. ఏకలవ్యుడు  చేసిన గొప్ప త్యాగానికి దేవతలు అశ్రువులతో దీవించారు. 

Comments

comments

Share this post

scroll to top