కాట‌న్ బ‌డ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే వాటితో చెవి సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌…

మన శ‌రీరంలో ఉన్న అత్యంత సున్నిత‌మైన భాగాల్లో చెవి అంత‌ర్గ‌త భాగం కూడా ఒక‌టి. దాంట్లో ఎన్నో ర‌కాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు, చెవి విన‌బ‌డ‌కుండా పోవ‌డ‌మో, ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌డ‌మో, ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య స‌మస్య‌లు రావ‌డ‌మో జ‌రుగుతుంటుంది. అయితే చెవి లోప‌లి భాగాల‌కు ఏదైనా ఎలా తాకుతుంది? అనే ప్ర‌శ్న మీరు అడ‌గ‌వ‌చ్చు, అదేనండీ కాట‌న్ ఇయ‌ర్ బ‌డ్స్‌తో. నేడు ఎవ‌రిని చూసినా చెవుల్లో ఈ బడ్స్ పెట్టుకుని తిప్పుకుంటున్నారు. అదేమంటే చెవిలోని వ్య‌ర్థాన్ని బ‌య‌ట‌కు తీయ‌డం కోసం అని చెబుతున్నారు. కానీ ఇలా కాట‌న్ బ‌డ్స్‌ను వాడ‌డం మాత్రం చెవికి హానిక‌ర‌మేన‌ట‌.

ear-buds

చెవుల్లో కాట‌న్ ఇయ‌ర్ బ‌డ్స్ పెట్టి వాడ‌డం వ‌ల్ల ఇంగ్లండ్‌లో ఏటా 7 వేల మందికి చెవి సంబంధ అనారోగ్యాలు క‌లుగుతున్నాయ‌ట‌. ఈ బ‌డ్స్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చెవిలోని అంత‌ర్గ‌త భాగాలు డ్యామేజ్ అవుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. చెవిలో ఉండే గులిమిని తీయ‌డం కోసం ఒక‌వేళ కాట‌న్ బ‌డ్ పెడితే ఆ గులిమిని మ‌రింత లోప‌లికి నెడుతుంద‌ట‌. దీని వ‌ల్ల ఇయ‌ర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్ప‌డుతుంద‌ట‌. దీంతో వినికిడి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

చెవుల్లో గులిమి ఏర్ప‌డ‌డం స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌క్రియేన‌ట‌. చెవిలో అంత‌ర్గ‌తంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్ర‌విస్తాయ‌ట‌. ఇది సాధార‌ణ స్థాయిలో ఉంటే మ‌న‌కు దాంతో క‌లిగే అనారోగ్యం ఏమీ ఉండ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. గులిమిలో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయ‌ట‌. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు స‌హ‌కరిస్తాయ‌ట‌. దీంతోపాటు చెవుల‌ను శుభ్రంగా ఉంచ‌డం కోసం కూడా గులిమి త‌యార‌వుతుంద‌ట‌.

ear-buds

చెవిలో త‌యార‌య్యే గులిమి స‌హ‌జంగా కొన్ని రోజుల‌కు దానంత‌ట అదే పోతుంద‌ట‌. అంతేకానీ దాన్ని తీయ‌డం కోసం కాట‌న్ బ‌డ్స్‌ను వాడ‌కూడ‌ద‌ని చెబుతున్నారు వైద్యులు. కాగా కొంత మందిలో గులిమి ఎక్కువ‌గా త‌యార‌వుతుంద‌ట. మ‌రి అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవ‌డం ఎలా అంటే 1 టీస్పూన్ ఉప్పును తీసుకుని 1/2 క‌ప్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్ర‌మంలో నాన‌బెట్టాలి. అనంత‌రం ఆ దూదిని తీసి స‌మ‌స్య ఉన్న చెవిని పై వైపుకు వ‌చ్చేలా త‌ల‌ను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుంచి కొంత ద్ర‌వం చుక్క‌లు చుక్క‌లుగా చెవిలో ప‌డుతుంది. త‌రువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి. స‌మ‌యం గ‌డిచాక త‌ల‌ను మ‌రో వైపుకు వంచితే ఆ ద్ర‌వం చుక్క‌లు ఇంకో చెవి గుండా బ‌య‌టకు వ‌స్తాయి. అనంత‌రం చెవుల‌ను నీటితో శుభ్ర ప‌రుచుకోవాలి. ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి పోతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్ర‌వ‌మే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్‌, మిన‌ర‌ల్ ఆయిల్ వంటివి వాడుకోవ‌చ్చు. కానీ వాటి ద్వారా మీకు ఎలాంటి అల‌ర్జీలు లేక‌పోతేనే వాటిని ట్రై చేయండి. లేదంటే ఉప్పు ద్ర‌వ‌మే బెట‌ర్‌.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top