“ప్లే ఆప్స్” కు వెళ్లినా “పూణే జట్టుకు” అనుకోని దెబ్బ..! ధోని, స్మిత్ ఎదుర్కోగలరంటారా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా “బాహుబలి” ఫీవర్ మరియు “ఐపీఎల్” ఫీవర్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకు సినిమా, క్రికెట్ రెండు కళ్ళు లాంటివి. బాహుబలి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అన్ని కొల్లగొట్టింది. ఐపీఎల్ కూడా లీగ్ మ్యాచ్లు అయిపోవడంతో ప్లే ఆఫ్’స్ కు చేరుకుంది. ముంబై, పూణే, హైదరాబాద్, కోల్కత్త. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముంబై పూణే తో ఈ రోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో తలపడనుంది. అయితే ఇంతలో పూణే జట్టుకి ఓ చేదు వార్త ఎదురైంది..!

14 కోట్లు పెట్టి “పూణే” జట్టు బెన్ స్టోక్స్ ను కొనుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కడే సెంచరీ కొట్టి పూణే ను విజయంవైపు తీసుకెళ్లాడు  “స్టోక్స్”. కానీ ఇప్పుడు అతను ప్లే ఆఫ్ మ్యాచులకు దూరం కానున్నాడు. సౌత్ ఆఫ్రికా తో వన్ డే సిరీస్ ఉండటం వల్ల “స్టోక్స్” దూరమయ్యాడు.

అంతే కాకుండా పూణే జట్టులో మంచి స్పిన్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న “ఇమ్రాన్ తాహిర్” కూడా ప్లే ఆఫ్’స్ కు దూరమయ్యాడు. ఇప్పుడు స్మిత్ సేన ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top