ఢిల్లీ మెట్రో రైల్వే స్టేష‌న్ టీవీల్లో నీలి చిత్రాల ప్ర‌సారం… షాక్ తిన్న ప్ర‌యాణికులు..! (Video)

టీవీలు లేదా సినిమా హాళ్ల‌లో సినిమాలు చూస్తున్న‌ప్పుడు వాటిలో అస‌భ్య‌క‌ర‌మైన స‌న్నివేశాలు లేదంటే పాట‌లు వ‌స్తుంటేనే చూడ‌లేం. అలాంటి స్థితిలో ఇక కుటుంబ స‌భ్యులు కూడా పక్క‌నే ఉంటే అప్పుడు వాటిని చూడ‌డం చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది. అలాంటిది న‌లుగురూ తిరిగే బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉంచిన ఓ టీవీలో ఏకంగా నీలి చిత్రాలే ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ సంఘ‌ట‌న దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ అది. ఆ రోజున ఎప్ప‌టిలాగే ప్ర‌యాణికుల హ‌డావిడితో ఆ స్టేష‌న్ ర‌ద్దీగా ఉంది. ఈ క్ర‌మంలో అక్క‌డ స్టేష‌న్‌లో ఉండే టీవీల్లో ఒక్క‌సారిగా నీలి చిత్రాలు ప్ర‌సార‌మ‌య్యాయి. దీంతో వాటిని చూసిన జ‌నాలు అవాక్క‌య్యారు. ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. ఇక మ‌హిళ‌లు, పిల్ల‌లు అయితే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కాగా కొంద‌రు మాత్రం ఆ టీవీ ఎవ‌రికీ క‌నిపించ‌కుండా కాగితాలు, కాట‌న్ ప్యాక్‌లు అడ్డం పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఒక్క‌సారే షాకింగ్ లా జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌తో ప్ర‌యాణికులంతా నివ్వెర‌పోయారు.

ఇటీవలే జ‌రిగిన ఈ సంఘ‌ట‌న కేవ‌లం ఢిల్లీలోని ప్ర‌జ‌ల‌నే కాదు, యావ‌త్ దేశమంత‌టినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. అస‌లు అలా ఎలా జ‌రుగుతుంది..? అని ప‌లువురు వాదిస్తున్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ల‌లో టీవీల‌ను అక్క‌డి అధికారులే కంట్రోల్ చేస్తారు క‌దా. అలాంటి స‌మ‌యంలో ఎవ‌రైనా నెట్‌లో ఆ చిత్రాల‌ను చూసి ఉంటే అప్పుడు అవి ఆ టీవీల్లో ప్ర‌సార‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టీవీల్లో కార్య‌క్ర‌మాల‌తోపాటు, యాడ్స్‌, ట్రెయిన్ల వివ‌రాల‌ను తెలిపేందుకు వాటిని కంప్యూట‌ర్ల‌తో అనుసంధానం చేస్తారు క‌దా. అందుకనే అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుని ఉంటుంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు సంబంధిత ఉన్న‌తాధికారులు అస‌లు ఇది ఎలా జ‌రిగి ఉంటుంది, అందుకు బాధ్యులు ఎవ‌రు అని క‌నిపెట్టే ప‌నిలో ప‌డ్డారు. కాగా గ‌తంలోనూ అంటే 2015లోనూ కేర‌ళ‌లో వాయంద్ బ‌స్ స్టాండ్లో ఉన్న టీవీల్లో ఇలాగే నీలి చిత్రాలు ప్ర‌సార‌మ‌య్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న రెండోది. ఈ విషయంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే మాత్రం ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.

Comments

comments

Share this post

scroll to top