“స్టేట్ బ్యాంకు” లో అకౌంట్ ఉందా..? మినిమమ్ బ్యాలెన్స్ పై SBI గుడ్ న్యూస్..!

స్టేట్ బ్యాంకు కాతాదారులు తప్పనిసరిగా మినిమం బాలన్స్ మైంటైన్ చేయాలని. లేదంటే చార్జీలు పడతాయని ఇటీవల బ్యాంకు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో 5000 , పల్లెల్లో అయితే 1000 రూపాయల మినిమం బాలన్స్ మైంటైన్ చేయాలని హెచ్చరించారు. అయితే ఈ సవరణపై కాతాదారులు మండి పడ్డారు. అందుకే ఇందులో పలు మార్పులు చేసింది స్టేట్ బ్యాంకు. ఛార్జీల బాదుడు ప్రక్రియను కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే అలాంటిదేమి లేదని.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

sbi-atm

కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు SBI తెలిపింది. ఈ మూడు రకాల అకౌంట్లకు మినిమం బాలన్స్ ఆంక్షలు ఉండవు..!

    • స్మాల్, బేసిక్ సేవింగ్ అకౌంట్
    • కార్పొరేట్ శాలరీ అకౌంట్
    • ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన స్కీం లో ఓపెన్ చేసిన అకౌంట్లు

కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. ఈ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రభావం పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్ దారులపై ప్రభావం చూపనుందని తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top