బిజినెస్ ప‌ర్స‌న్స్ యూత్ ఐకాన్స్ – స్టార్ట‌ప్స్ తో భారీ స‌క్సెస్

ప్ర‌భుత్వ కొలువుల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉండేది. ఇపుడు ఆ ప‌రిస్థితి మారింది. టాలెంట్ కు ప‌దును పెడుతూ.యువ‌తీ యువ‌కులు ప్రైవేట్ రంగాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. ప్ర‌తిభ వుంటే చాలు కంపెనీలు ఎగ‌రేసుకు పోతున్నాయి. వీరి కోసం ప్ర‌త్యేకంగా సెల‌క్ష‌న్ డ్రైవ్స్ నిర్వ‌హిస్తూ కొనుగ‌లు చేస్తున్నారు. మ‌రికొన్ని దిగ్గ‌జ కంపెనీలు ఇంట‌ర్న‌షిప్ ఇస్తూ ఎంపిక చేసుకుంటంగా ఇంకొన్ని కంపెనీలు ముంద‌స్తుగానే కొలువ‌కు సంబంధించి ఆఫ‌ర్ లెట‌ర్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక చోట కుదురుగా కూర్చుని .పై అధికారుల ఆదేశాలు పాటిస్తూ.ఠంచ‌నుగా హాజ‌రు ప‌ట్టిక‌లో సంత‌కం ఎందుకు చేయాలంటూ యూత్ స‌ర్కార బాట ప‌ట్ట‌డం లేదు. ప్ర‌పంచంలోని ఫేమ‌స్ కంపెనీల‌న్నీ ఒకప్పుడు స్టార్ట‌ప్ గా ప్రారంభ‌మైన‌వే.

Startups in Hyderabad

కొత్త త‌రం యూత్ అంతా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డాల‌ని.ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నారు. ఒక‌రి కింద ప‌ని చేయ‌డాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. తామే స్టార్ట‌ప్‌ల‌ను ఏర్పాటు చేసుకుని వాటిని కంపెనీలుగా మ‌లిచేందుకు త‌మ శ్ర‌మిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, పే టిఎం లాంటివే. కొత్త జ‌న‌రేష‌న్ అంతా కొలువుల‌కంటే వ్యాపార‌మే బెట‌ర్ అని భావిస్తున్నారు. చేతుల్లో డ‌బ్బులు లేక పోయినా ప‌ర్వాలేదు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఓ చ‌క్క‌ని ఐడియా వుంటే చాలు.కాసులు అవంతట అవే వ‌చ్చి వాలిపోతాయి.
పెట్టుబ‌డిదారులు వెతుక్కుంటూ వ‌స్తున్నారు.

ఎంట్ర‌ప్రెన్యూర్ షిప్ అనేది ఈ రోజుల్లో అతి పెద్ద అవ‌కాశాల‌ను సృష్టించే రంగంగా మారింది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఎక్కువే.అదే స‌మ‌యంలో రిస్క్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌ప్పుడు బ‌డా వ్యాపార‌వేత్త‌లు, ధ‌న‌వంతుల కుటుంబాలు మాత్ర‌మే వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపేవి..కొన్ని సంద‌ర్బాల్లో కొలువులు ల‌భించ‌ని వారంతా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేసేవారు. ఇపుడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. డిగ్రీ పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త ఐడియాల‌కు ప‌దును పెడుతున్నారు. స‌క్సెస్ ఫుల్ వ్యాపారంగా మార్చేందుకు ట్రై చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక స్తోమ‌త గురించి అస్స‌లు ప‌ట్టించు కోవ‌డం లేదు. రిస్క్ ఎంతైనా ప‌ర్వాలేదు.ఫేస్ చేసేందుకు సై అంటున్నారు యూత్. ఇంకో వైపు చూస్తే విద్యా సంస్థ‌లు సైతం స్టార్ట‌ప్ ల‌ను స్టార్ట్ చేస్తున్నాయి. త‌మ విద్యార్థులు ఎంత మంది అటు వైపు వెళ్లారో ఆయా సంస్థ‌లు స‌గ‌ర్వంగా ప్ర‌క‌టిస్తున్నాయి. ఇది ఓ ర‌కంగా మిగ‌తా యూత్ కు ఆలోచించుకునేలా.స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నాయి. ఇపుడు యూత్ ట్రెండ్ న‌డుస్తోంది.

ఐటీ, లాజిస్టిక్, హెల్త్ , టెలికాం, డిజిట‌ల్ టెక్నాలజీ, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగాల‌లో స్టార్ట‌ప్ లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. వీటిలో సీడ్ ఫండ్, పార్ట‌న‌ర్ షిప్, వెంచ‌ర్ కేపిట‌ల్ పెట్టేందుకు ప‌లు కంపెనీలు ప్ర‌యారిటీ ఇస్తున్నాయి. కంపెనీల ఏర్పాటులో యూత్ త‌మ స్నేహితులు, కుటుంబీకుల‌కు ప్ర‌యారిటీ ఇస్తోంది. స‌రికొత్త నైపుణ్యాల‌కు ప‌దును పెడుతూ .ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ప‌ని ప‌రంగా సంతృప్తి చెంద‌డం, కొత్త అవ‌కాశాల‌ను పెంపొందించ‌డంపైనే దృష్టి పెడుతున్నారు. తామేమిటో నిరూపించుకునేందుకు రెడీ అంటున్నారు. పాత త‌రంలో కంపెనీలు ఏర్పాటు చేయ‌డం, శిక్ష‌ణ ఇవ్వ‌డం, కొన్నాళ్లు ప‌ని చేయ‌డం, అనుభ‌వం గ‌డించడం, ప్ర‌మోష‌న్స్ తీసుకోవ‌డం, ఉపాధి ప‌రంగా పై మెట్లు ఎక్క‌డం అన్న‌ది సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండేది. ఉద్యోగంలో చేర‌డం అక్క‌డే ఉంటూ రిటైర్ కావ‌డం వ‌స్తూ ఉండేది. ఇపుడా ప‌రిస్థితి మారింది. ఈ త‌రం మిలీనియ‌ల్స్ ను సంతృప్తి ప‌ర‌చ‌డం లేదు. కాలు పెట్టిన కొద్ది రోజుల్లోనే రిజ‌ల్ట్ రావాల‌న్న‌ది యూత్ భావిస్తంది. ఎన్నో ఏళ్లు ప‌నిచేస్తే వ‌చ్చే గుర్తింపు క‌న్నా .టాలెంట్ కు ప‌దును పెడుతూ ఉన్న‌త స్థానాలు చేజిక్కించుకుని త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

గుర్తింపులో జాప్యాన్ని స‌హించ‌డం లేదు. వార‌స‌త్వం, అంచెలంచెలుగా ఎదగ‌డం, శిఖ‌ర స్థానానికి చేరుకోవ‌డం అన్న పాత ఆలోచ‌న‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేదు. ప్రాయోజిత దిశ‌గా ప‌ని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స‌త్ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో స్టార్ట‌ప్ ఎకో సిస్టం ముఖ్య భూమిక‌ను పోషిస్తోంది. రెండు ద‌శాబ్ధాల నుండే ఈ రంగం ఎదుగుతోంది. రిస్క్ భ‌రించి .ధైర్యంతో .ముందు చూపుతో కొత్త ఐడియాస్ కు ప్రాణం పోసుకున్న ఆలోచ‌న‌ల‌పై పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇది ఓ ర‌కంగా యూత్ కు బ‌లాన్ని ఇచ్చింద‌నే చెప్పాల్సి ఉంటుంది. ఐడియాల‌ను లాభాపేక్ష దృష్టితో చూడ‌డం లేదు. స‌మాజ శ్రేయ‌స్సు, అభివృద్ధి అనే దానిని బేస్ గా చేసుకుని స్టార్ట‌ప్ ల‌ను రూపొందిస్తున్నారు. మార్కెట్‌ను నిశితంగా ప‌రిశీలించి .త‌క్కువ లాస్ ను భ‌రించేలా.ఎక్కువ ఆదాయం గ‌డించేలా .ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మార్పే మిలీనియ‌ల్స్ కు అపార‌మైన అవ‌కాశాల‌ను క‌లుగ చేస్తున్నాయి. అడ్డంకుల‌ను , స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఈ జోరే వారిని యూత్ ఆంట్ర‌ప్రెన్యూర్స్‌గా త‌యారు చేస్తోంది. ఈ స్టార్ట‌ప్ ప్ర‌క్రియ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తోంది. త‌క్కువ టైం పెట్టుకోవ‌డం.లాభ న‌ష్టాలను బేరీజు వేసుకోవ‌డం తో చాలా మ‌టుకు స‌క్సెస్ ఫుల్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

ఐడియాలు కార్య‌రూపంలోకి వ‌చ్చేలా .లాభాలు గ‌డించేలా .స్టార్ట‌ప్‌లు దూసుకెళుతున్నాయి. ప్ర‌యోగాలు చేసేందుకు దారులు ఏర్ప‌డుతున్నాయి. వ‌య‌సు రీత్యా రిస్క్ ను భ‌రించేందుకు బ‌లం క‌లిగి ఉండ‌డం కూడా విజ‌యాలు సాధించేందుకు దోహ‌దం చేస్తున్నాయి. సంతృప్తితో పాటు సాధించామ‌న్న ఆనందం వారిని కొత్త‌గా ఆలోచించేలా చేస్తోంది. స్టార్ట‌ప్ అనే ఈ ప్ర‌యోగం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు స‌రికొత్త బ‌లాన్ని క‌లుగ చేస్తోంది. సో.మీకూ ఓ ఐడియా ఉంటే.ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి.క‌ష్ట‌ప‌డితే స‌క్సెస్ మీ స్వంత‌మ‌వుతుంది.మీకు బలాన్ని ఇస్తుంది.ఎంద‌రికో నీడ నిచ్చే అవ‌కాశం క‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top