విజయ్ దేవరకొండకు “అర్జున్ రెడ్డి” ఎలా వచ్చిందో తెలుసా..? నో చెప్పిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..!

పెళ్లి చూపులు సినిమాతో పాపులర్ అయిన విజయ్ దేవరకొండ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఆయన నటించిన “అర్జున్ రెడ్డి” (శుక్రవారం) రిలీజ్ అయి అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షుకులను కట్టిపడేస్తోందని సినీ విశ్లేషకులు చెబుతారు. అయితే ఈ కథ ముందుగా కొంతమంది హీరోలకు వద్దకు వెళ్లిందని, వారు తిరస్కరించారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే సరిపోతారని డైరక్టర్ సందీప్ రెడ్డి అనుకున్నారంట. అందుకే ముందుగా ఆయనకు కథ వినిపించారని తెలిసింది.

అల్లు అర్జున్ కి కథ నచ్చినప్పటికీ.. కమర్షియల్ హీరోగా స్థిరపడుతున్న ఈ సమయంలో ప్రేమకథలు చేయనని చెప్పినట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు యువ హీరో శర్వానంద్ ని కూడా హీరోగా చేయమని డైరక్టర్ అడిగినట్లు సమాచారం. ఆయన కూడా నో చెప్పారంట. వీరిద్దరూ నో చెప్పడంతో ఈ కథ విజయ్ చేతికి చిక్కింది. అతని ఖాతాలో మరో హిట్ చేరింది.

alluarjun-julayi

Comments

comments

Share this post

scroll to top