“స్టార్ మహిళా” ప్రోగ్రాంలో అనుకోని సంఘటన..! “రాజీవ్” పై కామెంట్స్ వేసిన పార్టిసిపంట్..తిట్టి షో వదిలెళ్లిన “సుమ”!

మాటే మత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి.  నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ..ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి  బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ.  ఏ టివి పెట్టినా..ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు. “రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్నారు “సుమ” గారు. “సుమ” గారి షోస్ అన్ని చాల ప్లైన్ గా, వల్గారిటీ లేకుండ అంటాయి. అందుకే ఆమె షోస్ కి ఫాన్స్ ఎక్కువ..! కానీ ఇటీవల..

ఈ టీవీ లో వచ్చే “స్టార్ మహిళా” ప్రోగ్రాం ప్రోమోలో ఓ పార్టిసిపంట్ తో “సుమ” గారికి గొడవ జరిగింది.
పార్టిసిపంట్: నేను చెప్పింది రైట్ ఆన్సర్
సుమ: నీకేమైనా పిచ్చ..? తప్పు అంటే అర్ధం కాదా..?
పార్టిసిపంట్: మీకు పిచ్చి, మీ రాజీవ్ కి పిచ్చి
సుమ: ఫస్ట్ షో వదిలి బయటికెళ్ళిపో
సుమ: ఎందుకు తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళని షో కి.

చివరికి “సుమ” కోపంగా షో వదిలి వెళ్ళిపోతుంది.ఆ వీడియో మీరే చూడండి. కాకపోతే ఇది ప్రోమో. అసలు సంగతి ఏంటో తెలీదు. ఇటీవలే trp కోసం “జబర్దస్త్” లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సుధీర్ టీం ను బయటకి పంపిన నాగబాబు, రోజా. ఒరిజినల్ ఎపిసోడ్ చూసే సరికి అందులో మ్యాటర్ లేదు. ఇది కూడా అలాగే అవుతుందేమో!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top