ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య పోరాటం.!

ఒకప్పుడు ఆమె స్టార్ హీరో సూర్యతో నటించింది. తమిళ్, కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విజయలక్ష్మీ అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైంది. ఆమె ఆరోగ్యం క్షిణించడంతో బెంగళూరులోని మాల్యా హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. విజయలక్ష్మీ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.

వారం క్రితం విజయలక్ష్మీ తల్లిని అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతలో విజయలక్ష్మీ కూడా హై బీపీ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అయితే తమ దగ్గర ఉన్న డబ్బంతా తల్లి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టామని, ఇప్పుడు తన చెల్లి ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేవని బోరున విలపిస్తూ చెప్పింది విజయాలక్ష్మీ చెల్లెలు. గత కొంత కాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో టీవీ సీరియల్స్ లో కూడా నటించడం మానేసిందని మీడియాకు వెల్లడించింది.

సినీ పరిశ్రమ సహాయం చేస్తే నా చెల్లి బాగవుతుంది

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అండగా నిలిస్తే తన చెల్లి ఆరోగ్యం మెరుగవుతుందని, తమని ఆదుకోవాలని ఆమె కోరారు.
విజయలక్ష్మీ కేవలం కన్నడ, తమిళ బాషల్లోనే కాక మలయాళం, తెలుగు భాషల చిత్రాల్లోనూ నంటించారు. సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా విజయలక్ష్మీకి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top