మీరు ఇలా చేయగలిగితే..మీకు ఇప్పట్లో పక్షవాతం రానట్లే…!?

వ్యాధి నిర్ధారణ కోసం ఇప్పుడంటే పలు రకాల స్కానింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇవేవీ అందుబాటులోకి  రానిరోజుల్లో  ఏం చేసేవారు? శరీరాన్ని పలు భంగిమల్లో నిలుచుండ బె ట్టి రుగ్మతలను కనిపెట్టే వారు. ఆ ప్రాచీన విధానమే జపాన్‌ పరిశోధకుల అవగాహనతో మళ్లీ కొత్తగా ఇప్పుడు మన మందుకొస్తోంది.ఒంటి కాలి మీద ఓ 20 క్షణాల  పాటు నిలుచోగలరా? అది మీకు సాధ్యం కాకపోతే పక్షవాతానికి, మతిమరుపు వ్యాధికి మీరు చాలా దగ్గరలో ఉన్నారని అర్థం అంటున్నారు పరిశోధకులు. ‘సో్ట్రక్‌’ అనే పత్రికలో ప్రచురితమైన వివరాలను అనుసరించి, 20 క్షణాలైనా నిలువలేని మీ అశక్తత  మీ ఆరోగ్యం ఎంతటి సంకట స్థితిలో ఉందో తెలియచేస్తుంది అంటున్నారు జపాన్‌ దేశపు పరిశోధకులు.

67 ఏళ్ల వయసులో ఉన్న 1300 మంది మంది పురుషులు, సీ్త్రల మీద జరిపిన అధ్యయనంలో వారిని ఒక నిమిషం పాటు ఒంటికాలి మీద నిలుచోమని చెప్పారు. అలా నిలుచోలేకపోయిన  దాదాపు 30 శాతం మందిలో మెదడుకు వెళ్లే సూక్ష్మ రక్తనాళాల్లో రెండు మూడు చోట్ట  దెబ్బ తిని ఉన్నట్లు 16 శాతం మందిలో ఏదో ఒక చోటే ఈ అవస్థ ఏర్పడినట్టు బయటపడింది. అలాగే 30 శాతం మందిలో రెండు మూడు చోట్ల రక్తస్రావం వుతున్నట్లు, 15 శాతం మందిలో ఏదో ఒక నాళంలో రక్తస్రావం అవుతున్నట్లు కనుగొన్నారు., లేదా కొద్ది పాటి రక్తస్రావం అవుతున్నట్లు భావించాలని వారు చెప్పారు.

ఒంటి కాలి మీద నిలబడలేకపోయిన వారందరి స్కానింగ్‌ రిపోర్టులు చూసినప్పుడు ఈ వాస్తవాలే బయటపడ్డాయి. మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బ తిన్న వారిలో వయసు పైబడిన వారే అధికగా ఉన్నారు. పైగా వీరిలో ఎక్కవ మంది అధిక రక్తపుపోటుతో బాధ పడుతున్నారు. ఈ అద్యయనంలో వెలుగు చూసిన మరో విషయం ఏమిటంటే, వారిలో జ్ఞాపక శక్తి ఆలోచనా శక్తి చాలా త క్కువగా ఉన్నాయి. ఏమైనా ఒంటి కాలి మీద నిలబెట్టే ఈ పరిశీలన మెదడు ఆరోగాన్ని  అంచనా వేసే ఒక అతి ముఖ్యమైన పరీక్షగా నిలబడింది. అయితే, అలా నిలబడలేకపోతున్న వాళ్లు మెదడు, జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యల విషయాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

Courtesy: ఆంధ్రజ్యోతి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top