గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజే పెను విషాదం చోటుచేసుకుంది. పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తలు తొక్కిసలాటకు గురైయ్యారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. భారతదేశంలోనే అతి పెద్ద పుష్కర ఘాట్ అయిన రాజమండ్రి కోటి గుమ్మం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్ని భారత ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
సత్వరం అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మోడీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.మరో వైపు చంద్రబాబు నాయుడు కంట్రోల్ రూమ్ లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అయితే అధికారుల నిర్లక్ష్యం పై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. స్నానానికి వచ్చే వారిని వెళ్లే వారిని ఒకటే దారి గుండా పపించడం, దగ్గర్లో అంబులెన్స్ లను ఏర్పాటు చేసుకోకపోవడం ప్రభుత్వ అవగాహన లోపానికి కారణాలని అంటున్నారు పుష్కరాలకు వచ్చన భక్తులు. ఇంకా మృతులను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు చనిపోయిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.