నిజంగా మృత్యువు అనేది మనకు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా మరు క్షణంలో చనిపోవచ్చు. దీన్నే విధి అంటారు. అది నిర్ణయించిన ప్రకారమే మనకు మరణం వస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా మరణించాల్సిందే. కాకపోతే ఒకరు ముందు, ఒకరు తరువాత. కానీ కొందరు మాత్రం చాలా త్వరగా అనుకోకుండా హఠాత్తుగా కన్నుమూస్తారు. అప్పటి వరకు ఎలాంటి అనారోగ్యం ఉండదు. కానీ సడెన్ గా చనిపోతారు. తోటి వారికి అంతులేని విషాదాన్ని మిగులుస్తారు. రాజస్థాన్లో సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది.
రాజస్థాన్లో తాజాగా ఓ ఘటన జరిగింది. ఓ ఫంక్షన్లో యువ జంట స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా, అందులో ఓ యువకుడు సడెన్ గా కింద పడిపోయాడు. అయితే అది అప్పుడు ప్లే అవుతున్న దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమాలోని తుజే దేకా తో హే జానా సనం అనే పాటలో భాగంగా అతను కింద పడ్డాడేమో అనుకున్నారు. కానీ అతను అందుకు నటించలేదు. మృతి చెందాడు.
పాట ప్లే అవుతుండగా డ్యాన్స్ చేస్తున్న అతను సడెన్గా కుప్పకూలాడు. మొదట అందరూ అతను పాటకు అనుగుణంగా నటిస్తున్నాడనే భావించారు. కానీ అతను చనిపోయాడని తరువాతే తెలుసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్కు లోనయ్యారు. అతను అలా సడెన్ గా మృతి చెందడంతో అతని బంధువులు, కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే వైద్యులు మాత్రం అతను కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోయాడని చెప్పారు. అయితే అలా ఆ జంట డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసి దాన్ని నెట్లో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఏది ఏమైనా ఇలాంటి తీవ్ర విషాద ఘటనలు ఎవరి జీవితంలోనూ జరగకూడదు కదా..!
watch video here:
https://www.youtube.com/watch?v=VasBnOmMTrk