డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే..టెన్త్ క్లాస్ త‌ప్ప‌క పాస్ అవ్వాల్సిన ప‌నిలేదు.!

డ్రైవింగ్ లైసెన్సు జారీలో ఉన్న విద్యార్హత నిబంధనను కేంద్ర రవాణాశాఖ తొలగించనున్నది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణాశాఖ అధికారులు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుకు ఎలాంటి విద్యార్హత లేనప్పటికీ ట్రాన్స్‌పోర్టు లైసెన్స్‌కు మాత్రం 8వ తరగతి ఉత్తీర్ణత, 20 ఏండ్ల వయస్సుతోపాటు లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్ తీసుకొని సంవత్సరం పూర్తికావాలి. ఈ అర్హతలు ఉంటేనే ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ జారీచేస్తారు. దీంతో పలువురు డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నప్పటికీ విద్యార్హత సర్టిఫికెట్లు లేక ట్రాన్స్‌పోర్టు లైసెన్సు పొందలేకపోతున్నారు. దీంతో డ్రైవింగ్ వచ్చినా లైసెన్స్ పొందక ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోయి ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని రాష్ర్టాలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో సవరణ చేసేందుకు అంగీకరించింది. విద్యార్హత నిబంధన స్థానంలో కొత్త షరతు విధించనున్నది. ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ పొందేవారు రవాణాశాఖ ఆధ్వర్యంలో మూడునెలలు ప్రత్యేక శిక్షణ పొందవలసి ఉంటుందని నిబంధన పెట్టనున్నారు.

Comments

comments

Share this post

scroll to top