ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఉత్తీర్ణత లో బాలికలదే పై చేయి గా వుంది. 6.5 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో91.43 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి స్థానంలో కడప జిల్లా 98.54 శాతం ఉత్తీర్ణత సాధించగా, చివరి స్థానంలో చిత్తూరు జిల్లా 71.19 శాతం ఉత్తీర్ణత సాధించింది. 3.645 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాగా.. రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 91.51 శాతం, బాలికలు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి గంటా తెలిపారు.
జూన్ 18 నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
జూన్ 18 నుంచి జులై 1 వరకు ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి 12 రోజుల్లోగా రూ.500 చెల్లించి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని గంటా తెలిపారు.
For Results : Click Here: