“రమా రాజమౌళి”కి “రాజమౌళి” రెండో భర్తనా..? అంతకు ముందు ఎవరితో పెళ్లి అయ్యింది..?

గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా లవర్స్ అందరిలో ఉండే కామన్ డౌట్ ఒక్కటే…అది ఏంటి అంటే..”కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”…ఈ ప్రశ్నకి రాజమౌళి ఏప్రిల్ లో  “బాహుబలి – 2 ” తో సమాధానం ఇవ్వనున్నాడు…”బాహుబలి” తో తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసాడు రాజమౌళి. అయితే రాజమౌళి సినిమాలు అనగానే మనకి గ్రాఫిక్స్, విన్యాసాలు గుర్తొచ్చేస్తాయి…

వృత్తిలోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా “రమా రాజమౌళి” గారు “రాజమౌళి” కి ఎంతో అండగా ఉంటారని రాజమౌళి చాలా సార్లు ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇప్పుడు కొడుకు “కార్తికేయ” ను కూడా సినిమా రంగంలో దింపేసాడు “రాజమౌళి”. రాజమౌళి – కీరవాణి అన్నదమ్ములు అని మనలో చాలా మందికి తెలుసు. కానీ “రమా రాజమౌళి” మరియు కీరవాణి గారి సతీమణి “శ్రీవల్లి” గారు సొంత అక్కచెల్లెలు అని చాలా తక్కువమందికి తెలుసు. ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే..ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో “రమా రాజమౌళి” గారిని ఇంటర్వ్యూయర్ ఒక క్యూస్షన్ అడిగింది..”రాజమౌళి గారు కార్తికేయకి స్టెప్-ఫాదర్ కదా..? మరి సొంత తండ్రి కొడుకులులాగా వారికి బాండ్ ఎలా కుదిరింది?”


రాజమౌళి గారు “రమా రాజమౌళి” కి రెండో భర్త అనే న్యూస్ అప్పటినుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అబద్దం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ 2012 లో ఓ ఇంటర్వ్యూ లో “రాజమౌళి” గారు స్వయంగా ఈ విషయం చెప్పారు. రమా గారితో నాకు చిన్నప్పటి నుండే పరిచయం ఉంది. కానీ చాలా సంవత్సరాల తరవాత ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకునేటప్పటికి తనకి ఒక అబ్బాయి ఉన్నాడు. డివోర్స్ అయిన తరవాత నేను పెళ్లి చేసుకున్న అని చెప్పాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వార్త సినీ అభిమానులలో చర్చనీయాంశం అయ్యింది!

Watch Video Here:

Watch Full Video Here:

Comments

comments

Share this post

scroll to top