రెగ్యుల‌ర్‌గా శృంగారం(సెక్స్)లో పాల్గొన‌క‌పోతే క‌లిగే 9 న‌ష్టాలు ఇవే..! ఇద్దరిలో ఎవరికెక్కువ అంటే.?

ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగే ప‌విత్ర కార్య‌మే శృంగారం. శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల లాభాలు ఉంటాయే గానీ న‌ష్టాలు మాత్రం ఉండ‌వు. శృంగారంలో రెగ్యుల‌ర్ గా పాల్గొంటే అధిక బ‌రువు త‌గ్గుతారు. ఎందుంటే ఆ కార్యం వ‌ల్ల క్యాల‌రీలు బాగా ఖ‌ర్చ‌వుతాయి క‌నుక‌. దీంతోపాటు శృంగారం వ‌ల్ల మూడ్ మారుతుంది. డిప్రెష‌న్ పోతుంది. మానసిక ఆందోళ‌న త‌గ్గుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవే కాకుండా శృంగారం వ‌ల్ల ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు క‌లుగుతాయి. అయితే శృంగారంలో పాల్గొన‌క‌పోతే మాత్రం న‌ష్టాలే ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఆ న‌ష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

 

1. శృంగారంలో పాల్గొన‌కపోతే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. పాల్గొంటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. అది ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రాన్ని క‌లిగించే బాక్టీరియా, వైర‌స్‌ల‌ను త‌రిమి కొడుతుంది. క‌నుక శృంగారంలో పాల్గొంటే ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి.

2. శృంగారంలో త‌ర‌చూ పాల్గొన‌కపోతే మ‌హిళ‌లు రుతు స‌మ‌యంలో క‌డుపు నొప్పి తీవ్రంగా వ‌స్తుంది. ఎందుకంటే శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఈస్ట్రోజ‌న్ లెవ‌ల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అవి రుతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. క‌నుక త‌రచూ శృంగారంలో పాల్గొంటే మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌స్య‌లు రావ‌నే చెప్ప‌వ‌చ్చు.

3. శృంగారంలో రెగ్యుల‌ర్‌గా పాల్గొన‌క‌పోతే హైబీపీ పెరుగుతుంది. దంప‌తులు ఇద్ద‌రిలో ఎవ‌రికైనా ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

4. శృంగారంలో పాల్గొన‌క‌పోతే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వ‌స్తుంద‌ట‌. ఎందుకంటే శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషులు స్క‌లిస్తే వీర్యంతోపాటు విష ప‌దార్థాలు కూడా బ‌య‌ట‌కి వెళ్లిపోతాయి. అలా కాకుండా శృంగారంలో పాల్గొన‌క‌పోతే స‌ద‌రు విష ప‌దార్థాలు లోప‌లే ఉండి అవి ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌ను తెచ్చి పెడ‌తాయి.

5. శృంగారంలో పాల్గొంటే ఎండార్ఫిన్లు బాగా రిలీజ్ అవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్లు అంటారు. ఇవి మ‌న మూడ్‌ను మార్చి హ్యాపీగా ఉంచుతాయి. క‌నుక శృంగారంలో పాల్గొంటే హ్యాపీగా ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. లేదంటే స్ట్రెస్ పెరిగిపోతుంది. డిప్రెష‌న్ బారిన ప‌డతారు.

6. శృంగారంలో రెగ్యుల‌ర్‌గా పాల్గొంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది చ‌క్క‌ని నిద్ర వ‌చ్చేలా చేస్తుంది. క‌నుక నిద్ర బాగా ప‌ట్టేందుకైనా శృంగారంలో పాల్గొనాల్సిందే.

7. రెగ్యుల‌ర్‌గా శృంగారంలో పాల్గొన‌ని వారిలో మూత్రాశ‌య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. వారి మూత్రాశ‌యాలు చిన్న‌విగా, బ‌ల‌హీనంగా అయిపోతాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

8. శృంగారంలో త‌ర‌చూ పాల్గొన‌కుంటే పురుషుల్లో అంగ‌స్తంభన స‌మ‌స్య త‌లెత్తుంద‌ని, ఫ‌లితంగా శృంగారం అంటే ఆస‌క్తి లేకుండా పోతుంద‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

9. శృంగారంలో త‌ర‌చూ పాల్గొన‌క‌పోతే మ‌హిళ‌ల్లో యోని గోడ‌లు ప‌లుచ‌గా, చిన్న‌గా అయిపోతాయ‌ట‌. దీంతోపాటు అవి బ‌ల‌హీనంగా మారుతాయ‌ట‌. క‌నుక రెగ్యుల‌ర్‌గా శృంగారంలో పాల్గొనాల‌ని వైద్యులు చెబుతున్నారు. దీంతో పైన చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top