శృంగారం తో పాటు బెడ్ రూమ్ ఎలా ఉండాలో చెబుతున్న ఐకియా కంపెనీ!!

శృంగారం అంటే అందరూ ఒకటే రకంగా అనుకుంటారు. కానీ దానిలో కూడా చాలా రకాల శృంగారం, భంగిమలు ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే శృంగారాన్ని సరిగా అనుభవించక కొందరు అశ్రద్ధ చూపిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం ఎన్నో పుస్తకాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఐకియా కంపెనీ ఓ కొత్త బుక్ తీసుకొచ్చింది. బుక్ కాకుండా ఆ భంగిమలకు తగ్గట్టు బెడ్ రూమ్ ని ఎలా మార్చుకోవాలో ఆ పుస్తకంలోఫొటోలతో సహా ప్రచురించడం విశేషం.

ఫర్నీచర్ కంపెనీ ఐకియా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. స్వీడన్ కి చెందిన ఈ ఐకియా సంస్థ హైదరాబాద్ లో కూడా ఇటీవల కూడా ఓ ఫర్నిచర్ షో రూం ప్రారంభించారు.

ఇప్పుడు సెక్స్ పుస్తకాన్ని ఐకియా విడుదల చేయడం విశేషం. కాకపోతే.. సెక్స్ గురించే కాకుండా… బెడ్ రూమ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దానిని ఈ బుక్ లో ఫోటోలతో సహా ప్రింట్ చేసింది కియా కంపెనీ.

అయితే పడక గదిని స్వర్గంగా ఎలా మార్చుకోవాలో తెలుపుతూ అందమైన ఫొటోలతో 44 పేజీల పుస్తకాన్ని విడుదల చేసింది. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది ఈ పుస్తకం. సెక్స్ లో వివిధ భంగిమలు ఉన్నట్లే.. ఈ పుస్తకంలో ఆయా భంగిమల పేరుతో పాటు భంగిమలకు తగ్గట్టు బెడ్ రూమ్ డిజైన్స్ కూడా ఉన్నాయి.

ఈ పుస్తకాన్ని ఐకియా కంపెనీ ఎంతలా వాడుకుందంటే కామసూత్రలో ఉండే ప్రతి భంగిమకి ఓ పేరు ఉంటుంది. అలాగే ఆ భంగిమకు తగ్గట్టు బెడ్ రూమ్ డిసైన్ ఉండటంతో ఈ బుక్కుతో పాటు ఐకియా మంచాలు కూడా అమ్ముడుపోతున్నాయి.

ప్రతి భంగిమకి ఉదాహరణతో సహా వివరిస్తుంది ఐకియా కంపెనీ. ఈ బుక్కుకి బయట మార్కెట్ లో బాగా డిమాండ్ ఉందట.

 

 

Comments

comments

Share this post

scroll to top