రాత్రి 11 తర్వాతే శృంగారంలో పాల్గొంటారా.? పగలు కూడా చేస్తుంటారు.! అని హీరోయిన్స్ ఫైర్.! అసలేమైంది?

కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల‌ను ఇక‌పై రాత్రి పూట 11 గంట‌ల త‌రువాత మాత్ర‌మే టీవీల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ప‌గ‌టి పూట‌, ప్రైమ్ టైమ్‌ల‌లో ఇలాంటి యాడ్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తే ఆ స‌మ‌యాల్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి టీవీ చూడ‌డం ఇబ్బందిగా ఉంటుంద‌నే నేప‌థ్యంలోనే ఇలాంటి ఆదేశాల‌ను ఇచ్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకుంది. కానీ దీనిపై చాలా మంది త‌మ విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ప‌లువురు న‌టీమ‌ణులు ఈ విష‌యంపై బ‌హిరంగ చ‌ర్చ‌లోనే త‌మ అభిప్రాయాల‌ను ధైర్యంగా చెప్పారు. ఇంత‌కీ ఆ న‌టీమ‌ణులు ఎవ‌రు, వారు ఏం చెప్పారో తెలుసా..?

ఒక‌ప్ప‌టి న‌టీమ‌ణులు గౌత‌మి, ఖుష్బూల‌తోపాటు నేటి త‌రం తార‌లు తాప్సీ, కాజ‌ల్ అగ‌ర్వాల్‌లు ఇండియా టుడే నిర్వ‌హించిన ఓ స‌దస్సుకు హాజ‌రై అందులో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు దీటుగా జ‌వాబులు చెప్పారు. అయితే ఆ ప్ర‌శ్న‌ల్లో పైన చెప్పిన కండోమ్ యాడ్ కూడా ఉంది. స‌ద‌రు నిషేధం ప‌ట్ల మీ అభిప్రాయం ఏమిట‌ని ఆ నలుగురు న‌టీమ‌ణులను అడ‌గ్గా వారు ఇలా స్పందించారు. రాత్రి 11 గంట‌ల త‌రువాతే కండోమ్ యాడ్స్‌ను ప్ర‌సారం చేసే విష‌యంపై అభిప్రాయం అడగ్గా అందుకు న‌టి గౌత‌మి మాట్లాడుతూ… కండోమ్ అనేది సుర‌క్షిత‌మైన శృంగారానికే కాదు, జ‌నాభా నియంత్ర‌ణ‌కు కూడా ప‌నికొస్తుంద‌ని చెప్పింది. అయితే కండోమ్ యాడ్‌ల‌ను ప్రైమ్ టైమ్‌లో వేస్తే దాని ఉద్దేశం జ‌నాల‌కు ఇంకా ఎక్కువ‌గా చేరుతుంద‌ని తెలియజేసింది.

watch video here:

ఇక కండోమ్ యాడ్స్‌పై ఖుష్బూ మాట్లాడుతూ… కండోమ్ యాడ్స్‌ను ప్రైమ్ టైమ్‌లోనే వేయాలి. పిల్ల‌ల‌కు సెక్స్ ఎడ్యుకేష‌న్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాలి. కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల‌ను మిడ్ నైట్ మ‌సాలాలా చూడ‌కూడ‌దు. మ‌నుషులు రాత్రి పూటే కాదు, ప‌గ‌టి పూట కూడా శృంగారంలో పాల్గొంటారు క‌దా. అలాంట‌ప్పుడు ప‌గ‌టి పూట కూడా కండోమ్ యాడ్స్ వేయాలి అని చెప్పింది. ఇక ఈ విష‌యంపై తాప్సీ మాట్లాడుతూ.. కండోమ్ యాడ్స్ ప్రైమ్ టైమ్‌లో వేయ‌క‌పోతే వాటి గురించి జ‌నాల‌కు ఎలా తెలుస్తుంది, ఇక జనాభా ఎలా కంట్రోల్ అవుతుంది. అప్పుడు మ‌న దేశం టాప్ పాపులేష‌న్ ఉన్న దేశంగా అవ‌త‌రిస్తుంది, క‌నీసం అందులోనైనా మొద‌టి ప్లేస్ వ‌స్తుంది కదా, సంతోషం.. అని చెప్పింది. ఇక ఈ విష‌యంపై కాజ‌ల్ ఏమందంటే… పెరుగుతున్న జ‌నాభాను క‌చ్చితంగా నియంత్రించాల్సిందే. పిల్ల‌ల‌ను పుట్టించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న వారిపై కండోమ్ యాడ్స్ ప్ర‌భావం చూపిస్తాయి. క‌నుక ప్రైమ్ టైమ్‌లో క‌చ్చితంగా ఈ యాడ్స్‌ను వేయాలి.. అని కాజ‌ల్ చెప్పింది. ఏది ఏమైనా.. నిజంగా కండోమ్‌ల‌ను ఆ దృష్టితో చూడ‌కుండా ఓ మంచి కార‌ణంతో చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top