నిన్న‌టి అజ్ఙాత వాసి ఆడియో లాంచ్ లో…. ప‌వ‌న్ , త్రివిక్ర‌మ్ స్పీచ్ త‌ర్వాత హైలెట్ ఈమె ఫ‌ర్ఫార్మెన్స్ యే!

నిన్న జ‌రిగిన అజ్ఙాత వాసి ఆడియో లాంచ్ లో..ప‌వ‌న్ , త్రివిక్ర‌మ్ ల‌ స్పీచ్ త‌ర్వాత హైలెట్ వీణ శ్రీవాణి ఫ‌ర్ఫార్మెన్స్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో హిట్ సాంగ్స్ కు త‌న‌దైన వీణ ట‌చ్ ఇచ్చిన శ్రీవాణి …నిన్నటి ప‌వ‌న్ కళ్యాన్ అజ్ఙాత వాసి ఆడియో లాంచ్ ఈవెంట్ లో అద‌ర‌గొట్టింది. ప‌వ‌న్ హిట్ సాంగ్స్ ను వీణ మీద వాయించి ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది.! ఆర‌డుగ‌లు బ‌ల్లెట్టు అంటూ స్టార్ట్ చేసిన ఆమె …అమ్మాయే స‌న్నాగా…. కాట‌మ‌రాయుడా క‌దిరి న‌ర్సింహుడా…బాపుగారి బొమ్మో… గ‌న్నులాంటి క‌న్నులున్న‌….ప‌వ‌న్ ఆల్ టైమ్ హిట్ పాట‌ల‌పై వీణను వాయించింది సూప‌ర్ అనిపించింది.!

ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన శ్రీవాణి పేరు ఈ ఈవెంట్ తో ఒక్క‌సారిగా మార్మోగిపోయింది.! క్లాసిక‌ట్ పాట‌ల‌కే ప‌రిమిత‌మైన వీణపై ఉర‌మాస్ పాట‌ల‌ను వాయిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాణి….వీణ‌నే త‌న ఇంటిపేరుగా చేసుకొని వీణ శ్రీవాణి అయ్యింది.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top